Zynysys biologics Invests in Hyderabad : తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా అమెరికాలో మంత్రి కేటీఆర్ పర్యటన సాగుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు అంతర్జాతీయ కంపెనీలు ముందుకు వచ్చిన విషయం తలిసిందే. తాజాగా మధుమేహుల కోసం ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ‘జెనిసిస్ బయాలజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ హైదరాబాద్‌లో తమ కంపెనీ విస్తరణకు అంగీకారం తెలిపింది. జీనోమ్ వ్యాలీలో మరో 50 నుంచి 60 మిలియన్ డాలర్ల అదనపు పెట్టుబడితో ‘రీ కాంబినెంట్ బల్క్ మాన్యుఫాక్చరింగ్’ కేంద్రం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Technip FMC Company invests in Hyderabad : రాష్ట్రంలో 1,250 కోట్ల పెట్టుబడికి ఫ్రెంచ్ అమెరికన్ ఆయిల్ అండ్ గ్యాస్ దిగ్గజ కంపెనీ.. టెక్నిప్ ఎఫ్ఎంసీ సుముఖత వ్యక్తం చేసినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. తమ సాఫ్ట్‌వేర్ గ్లోబల్ డెలివరీ సెంటర్, ప్రెసిషన్ ఇంజినీరింగ్, మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి హైదరాబాద్‌ను కీలక కేంద్రంగా ఎంచుకుంటున్నట్లు సంస్థ ప్రకటించినట్లు తెలిపారు. రూ5,400 కోట్ల ఎగుమతి విలువతో.. 1,250 కోట్లను సంస్థ పెట్టుబడిగా పెట్టడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. సంస్థ రాకతో సుమారుగా 4వేల మందికి ఉపాధి కల్పన జరుగుతుందని చెప్పారు.