తెలంగాణ

telangana

ETV Bharat / state

భారత్‌లో పెట్టుబడులకు మొదటి మజిలీ తెలంగాణయే

దావోస్​లో ఏర్పాటు చేసిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పరిశ్రమలు, ఐటీ , పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. భారత్​లో పెట్టుబడులకు ప్రపంచానికి స్వాగతం పలికేందుకు తెలంగాణ రాష్ట్రమే మొదటి మజిలీ అంటూ ట్విటర్​లో వ్యాఖ్యానించారు.

By

Published : Jan 21, 2020, 8:25 AM IST

telangana-is-first-state-to-encourage-foreign-investments-says-minister-ktr-at-davos
భారత్‌లో పెట్టుబడులకు మొదటి మజిలీ తెలంగాణయే

భారత్‌లో పెట్టుబడులకు ప్రపంచానికి స్వాగతం పలుకుతున్నామని, తెలంగాణ రాష్ట్రమే దీనికి మొదటి మజిలీ అని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్‌ వెళ్లిన ఆయన సోమవారం ట్విటర్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.

ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ బృందానికి తాను నాయకత్వం వహిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలో అత్యంత విలువైన పారిశ్రామిక సంస్థలు అమెరికా తర్వాత హైదరాబాద్‌ను ఎంచుకున్నాయని తెలిపారు. మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, యాపిల్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌ సంస్థల ఎమోజీలను ట్విటర్‌కు జత చేశారు.

దావోస్‌ పర్యటనలో ఉన్న కేటీఆర్‌ నేడు పలు పారిశ్రామిక సంస్థల అధిపతులతో భేటీ కానున్నారు. తెలంగాణలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడులు, భాగస్వామ్యాల గురించి చర్చిస్తారు. సదస్సు ప్రారంభోత్సవం అనంతరం తెలంగాణ పెవిలియన్‌ను కేటీఆర్‌ ప్రారంభిస్తారు. ఇక్కడే పారిశ్రామికవేత్తలతో భేటీలు జరుగుతాయి.

ఇవీ చూడండి: రైతుబంధుకు రూ.5100 కోట్లు మంజూరు

ABOUT THE AUTHOR

...view details