రాష్ట్రంలో కరోనా పరీక్షలు ఎందుకు తగ్గించారో తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మహారాష్ట్రలో రోజుకు లక్షన్నర పరీక్షలు చేస్తున్నారని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. మహారాష్ట్రలో పరిస్థితి తెలంగాణ కంటే దారుణంగా ఉన్నందున పోల్చలేం కానీ.. రాష్ట్రంలో పరీక్షలు కొన్ని రోజులు ఎక్కువగా.. మరికొన్ని రోజులు తక్కువగా చేస్తున్నారని అభిప్రాయపడింది. రోజుకు 40వేల పరీక్షలు చేస్తామని తెలిపిన సర్కారు.. దాన్ని ఎందుకు అమలు చేయట్లేదని ధర్నాసనం ప్రశ్నించింది.
'రాష్ట్రంలో కరోనా పరీక్షలు ఎందుకు తగ్గించారు': హైకోర్టు
కరోనా పరీక్షలు, చికిత్సలు, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫీజులు.. తదితర అంశాలపై దాఖలైన 24 వ్యాజ్యాలపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు ఎందుకు తగ్గించారో అక్టోబరు 6లోపు నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేసింది.
కరోనా పరీక్షలు, చికిత్సలు, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫీజులు.. తదితర అంశాలపై దాఖలైన 24 వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి. విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. కరోనా ఆసుపత్రుల్లో పడకల కొరతపై ఆరా తీసింది. డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాల ప్రకారం ప్రతీ వేయి మందికి ఐదు పడకలు ఉండాలని..కానీ రాష్ట్రంలో ఒక్కటే ఉందని పేర్కొంది. ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు తండ్రి కరోనాతో మరణించారనందున కరోనా తాజా పరిస్థితులపై నివేదిక సమర్పించేందుకు గడువు ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోరారు. అందుకు అంగీకరించిన హైకోర్టు.. అక్టోబరు 6లోపు నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి:'కొత్త బిల్లులతో రైతుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు'