తాము ఇస్తున్న ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకుంటున్నట్టు కనిపించడం లేదని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. లాక్డౌన్లో సీజనల్ రైతుల పంటలు మార్కెట్ చేసుకునేలా, ఇతర రాష్ట్రాలకు రవాణా చేసే విధంగా ఏర్పాటు చేయాలని కోరుతూ విశ్రాంత వెటర్నరీ డాక్టర్ నారాయణ రెడ్డి పిల్ దాఖలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్.. - తెలంగాణ హైకోర్టు తాజా వార్తలు
ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతుందని హైకోర్టు తీవ్రంగా స్పందించింది. సీజనల్ రైతుల పంటల మార్కెటింగ్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటని ప్రశ్నించింది. నష్టపోయిన అన్నదాతలకు ఎలా సాయం చేస్తారో చెప్పాలని నిలదీసింది.
ఆ వ్యాజ్యంపై ఇవాళ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. రైతులకు తగిన ఏర్పాట్లు చేయాలని గతంలో హైకోర్టు ఆదేశించినప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. సీజన్ కూడా పూర్తైందని... పంటలు అమ్మలేక రైతులు నష్టపోయారన్నారు. సీజనల్ పంటల మార్కెటింగ్ కోసం ఏం చర్యలు తీసుకున్నారని హైకోర్టు ప్రశ్నించింది. నష్టపోయిన రైతులకు ఏంచేస్తారో నివేదించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
ఇదీ చూడండి :పోతిరెడ్డిపాడుపై పోరాటానికి ప్రత్యేక కమిటీ: ఉత్తమ్