కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ప్రతి ఏటా నేషనల్ వాటర్ మిషన్ కింద పురస్కారాలను అందజేస్తోంది. 2020 సంవత్సరానికి గాను తెలంగాణ ఉత్తమ రాష్ర్టం అవార్డు కోసం గతం మార్చి నెలలో నామినేషన్ దాఖలు చేసింది. జల శక్తి మంత్రిత్వ శాఖ నిర్దేశించిన అన్ని అంశాలను వివరిస్తూ, దృవీకరణ పత్రాలను జత చేసి నామినేషన్ దాఖలు చేసింది.
దేశ వ్యాప్తంగా 20 రాష్ట్రాల నుంచి వచ్చిన నామినేషన్లను పరిశీలించి 6 రాష్ట్రాలను చివరి దశ పరిశీలనకు కేంద్రం ఎంపిక చేసింది. తెలంగాణ, తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్, ఉత్తర ప్రదేశ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు చివరి దశ పరిశీలను ఎంపిక అయినట్టు జల్ శక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఆయా రాష్ట్రాలలో ఉన్న CWC అధికారులను క్షేత్ర స్థాయి పరిశీలన చేసి వాస్తవ నివేదిక సమర్పించామని కేంద్రం ఆదేశించింది. హైదరాబాద్ లో ఉన్న CWC అధికారులు గత శుక్రవారం క్షేత్ర పర్యటనకు వెళ్ళి మిషన్ కాకతీయ చెరువులు, చెక్ డ్యాంలు, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన రంగనాయక పంప్ హౌజ్, రంగనాయక సాగర్ జలాశయం, నిజామాబాద్ జిల్లాలో అమలు అవుతున్న పైపుడ్ ఇరిగేషన్ సిస్టమ్ పనులను పరిశీలించారు.
ఈ రోజు జలసౌధలో తెలంగాణ సాగునీటి శాఖ అధికారులతో సమావేశమై తెలంగాణ సాగునీటి శాఖ కాళేశ్వరం ప్రాజెక్టులో అమలు చేస్తున్న డెసిషన్ సపోర్టింగ్ సిస్టమ్, కెనాల్ ఆటోమేషన్ సాంకేతిక అంశాలను తెలుసుకున్నారు. ఈ ఏడు సంవత్సరాలలో తెలంగాణ సాగునీటి రంగంలో సాధించిన ప్రగతిని ఈఎన్సీ మురళీధర్ వారికి వివరించారు. సాగునీటి శాఖ కోరిన అదనపు సమాచారాన్ని కూడా అందజేశారు.
ఇదీ చదవండి:Ts schools: 8 వేల మంది టీచర్లకు డిప్యుటేషన్లు