తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Group 4 Preliminary key Released : గ్రూప్‌-4 పరీక్ష ప్రాథమిక కీ విడుదల - తెలంగాణ వార్తలు

TSPSC Release Group 4 Key
Telangana Group 4 KEY

By ETV Bharat Telangana Team

Published : Aug 28, 2023, 8:29 PM IST

Updated : Aug 28, 2023, 9:24 PM IST

20:26 August 28

group 4 key

Telangana Group 4 Preliminary key Released Today: గ్రూప్​- 4 ఉద్యోగాల కోసం నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని టీఎస్​పీఎస్సీ ప్రకటించింది. జులై 1న ఉదయం, మధ్యాహ్నం వేళల్లో రెండు పేపర్లుగా జరిగిన ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థుల ఓఎంఆర్​ పత్రాల ఇమేజింగ్ కాపీలు, మాస్టర్ ప్రశ్నపత్రాలు, ప్రాథమిక కీ(Preliminary key) వెబ్​సైట్​లో పొందుపరిచినట్లు తెలిపింది. పేపర్-1 పరీక్షకు సంబంధించి 7,63,835, పేపర్ -2 పరీక్షకు సంబంధించి 7,61,028 మంది అభ్యర్థులు హాజరైయ్యారని వెల్లడించింది. పరీక్ష రాసిన అభ్యర్థుల ఓఎంఆర్​ షీట్​ల కాపీలను సెప్టెంబర్ 27 సాయంత్రం 5 గంటల వరకు వెబ్ సైట్​లో అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది.

TSPSC Group 4 KEY Objections Date: జులై 1న జిల్లా అధికారుల నుంచి తీసుకున్న ఫోన్ ద్వారా తీసుకున్న ప్రాథమిక సమాచారం మేరకు పేపర్-1 పరీక్షకు 7,62,872 మంది, పేపర్ -2 పరీక్షకు 7,61,198 మంది హాజరైనట్లు సమాచారం అందిందని.. అయితే జిల్లాల నుంచి ఓఎంఆర్​ పత్రాలను తీసుకుని ఇమేజింగ్ చేసిన తర్వాత హాజరైన అభ్యర్థుల సంఖ్యపై కమీషన్ స్పష్టత ఇచ్చింది. గ్రూఫ్- 4 పరీక్ష ప్రాథమిక కీపై అభ్యంతరాలను ఈనెల 30 తేదీ నుంచి సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నమోదు చేయాలని టీఎస్​పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు. ఈమేరకు టీఎస్​పీఎస్సీ(TSPSC) వెబ్​సైట్​లో ప్రత్యేక లింకు ద్వారా నమోదు చేయాలని పేర్కొన్నారు. గడువు ముగిసిన తర్వాత వచ్చిన అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోబోమని తెలిపారు. అభ్యంతరాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లింకు ద్వారా వచ్చిన బాక్సులో ఆంగ్లంలో నమోదు చేయాలన్నారు. ఈ-మెయిల్స్​ ఇతర వ్యక్తిగత విజ్ఞాపనల ద్వారా వచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోబోమని టీఎస్​పీఎస్సీ స్పష్టం చేసింది. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్​సైట్​ https:/www.tspsc.qov.inను సందర్శించాలని సూచించారు.

TSPSC Group 4 Official WebSite: రాష్ట్రవ్యాప్తంగాగ్రూప్​-4 పరీక్ష జులై 1న టీఎస్​పీఎస్సీ నిర్వహించింది. మొదటి పేపర్‌ ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు జరిగింది. రెండో పేపర్​ మధ్యాహ్నం నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 878 కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్షలను రాశారు. ఆలస్యం కారణంగా కొందరని.. సరైన పత్రాలు లేకపోవడంతో మరికొందరిని అధికారులు వెనక్కి పంపించారు. హైదరాబాద్‌ సహా అనేక ప్రాంతాల్లో పరీక్షకు ఆలస్యంగా వచ్చిన పలువురు అభ్యర్థులనూ పరీక్ష నిర్వహణ సిబ్బంది తిప్పి పంపించారు. ఓ పరీక్షా కేంద్రానికి గ్రూప్​-4 అభ్యర్థి సెల్‌ఫోన్ తీసుకురాగా.. ఆ విషయాన్ని గుర్తించిన అధికారులు అతడ్ని డీబార్‌ చేశారు.

Telangana Group 4 Exam : రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-4 పరీక్ష

TSPSC Group 4 Exam 2023 : గ్రూప్​-4 పరీక్ష.. సెల్​ఫోన్​తో ఎగ్జామ్ హాల్​లోకి.. చివరకు...

Telangana Group 4 Exam : గ్రూప్​ 4 పరీక్ష.. ఆలస్యంగా కేంద్రానికి.. జస్ట్​లో మిస్​ అయిన అభ్యర్థులు

Last Updated : Aug 28, 2023, 9:24 PM IST

ABOUT THE AUTHOR

...view details