తెలంగాణ

telangana

ETV Bharat / state

కృష్ణా యాజమాన్య బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ - ఏపీ టెండర్లు పిలవడంపై ఫిర్యాదు - ఏపీ ప్రాజెక్టుల నిర్మాణాలపై తెలంగాణ ఫిర్యాదు

Telangana Govt letter to KRMB : కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుల కొత్త పనులు చేపడుతోందని లేఖలో పేర్కొంది. హంద్రీనీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ ప్రాజెక్టుల విస్తరణ పనులకోసం ఏపీ టెండర్లు పిలవడంపై ఫిర్యాదు చేసింది. విభజన చట్టానికి విరుద్దంగా టెండర్లు పిలిచారని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. గతంలోనే ఫిర్యాదు చేసినా ఏపీ పట్టించుకోలేదని ఫిర్యాదులో వివరించింది. అనుమతుల్లేకుండా ఏపీ చేపట్టిన పనులు ఆపివేయించాలని విజ్ఞప్తి చేసింది.

Telangana Complains on Construction of AP Projects
Telangana Govt letter to KRMB

By ETV Bharat Telangana Team

Published : Dec 15, 2023, 7:11 PM IST

Telangana Govt letter to KRMB :కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. అనుమతులు లేకుండా, విభజన చట్టానికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు పిలవటంపై ఫిర్యాదు చేసింది. అనుమతులు లేకుండా చేపడుతున్న గాలేరు నగరి, హంద్రీనీవా, తెలుగుగంగ ప్రాజెక్టుల విస్తరణ పనులు నిలిపివేసేలా చూడాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కోరింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ కేఆర్ఎంబీ ఛైర్మన్​కు లేఖ రాశారు.

బచావత్ ట్రైబ్యునల్​ను ఉల్లంఘిస్తూ, విభజన చట్టానికి విరుద్ధంగా కృష్ణ బేసిన్ వెలుపలకు నీటిని తరలించేందుకు చేపట్టిన గాలేరు నగరి, హంద్రీనీవా, తెలుగుగంగ ప్రాజెక్టుల పనులు, విస్తరణ పనులు ఆపాలని గతంలో బోర్డుకు ఫిర్యాదు చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం ఇటీవల వివిధ పనులకు టెండర్లు పిలిచిందని ఈఎన్సీ తెలిపారు.

Telangana Complains about Construction of AP Projects :గాలేరు నగరి నుంచి హంద్రీనీవాకు నీటిని తరలించేందుకు ఎత్తిపోతల, అన్నమయ్య జిల్లాలో కలిబండ, బెస్తపల్లి, జరికొండ రెండో దశ ఎత్తిపోతల పథకాలు, సత్యసాయి గంగ కాల్వపై క్రాస్ రెగ్యులేటర్ నిర్మాణం, కడప జిల్లా కలసపాడు మండలంలో ఎత్తిపోతల పథకాలు, కాసినాయన మండలంలో ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం టెండర్లు పిలిచినట్లు లేఖలో పేర్కొన్నారు.

ఈ పనులన్నింటినీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభజన చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిందని, గాలేరు నగరి - హంద్రీనీవా లింక్ పనులను ఆపాలని గతంలో బోర్డు కూడా ఏపీకి సూచించిందని గుర్తు చేశారు. అన్ని అంశాలను పరిశీలించి ఎలాంటి అనుమతులు లేకుండా, విభజన చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ప్రాజెక్టుల పనులను కొనసాగించకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిలువరించాలని కృష్ణా బోర్డును కోరారు.

సాగర్ కుడికాలువ నుంచి నీరు తీసుకోవడం ఆపాలి - ఏపీకి కృష్ణా బోర్డు అదేశం

నాగార్జునసాగర్ వివాదం - మరోమారు తెరపైకి కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టు స్వాధీనం అంశం

ABOUT THE AUTHOR

...view details