haritha nidhi : హరితనిధికి సంబంధించిన విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. హరితనిధికి సంబంధించి అక్టోబర్ ఒకటో తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ వేదికగా ప్రకటన చేశారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ఇతర వర్గాల నుంచి విరాళాలతో హరితనిధి అమలు కానుంది. అటవీశాఖ ఇందుకు నోడల్ శాఖగా వ్యహరించనుంది. అటవీశాఖ మంత్రి నేతృత్వంలో రాష్ట్ర స్థాయి కమిటీ పర్యవేక్షణలో హరితనిధి ఉంటుంది. అటవీశాఖ ఉన్నతాధికారులు, ఆర్థికశాఖ కార్యదర్శి కమిటీలో సభ్యులుగా ఉంటారు. నర్సరీల ఏర్పాటు, మొక్కల పెంపకం, సంరక్షణ, శిక్షణ, అవగాహనా కార్యక్రమాలు, పర్యవేక్షణ సంబంధిత అంశాల కోసం ఈ నిధిని వినియోగిస్తారు.
haritha nidhi: హరితనిధికి విధివిధానాలను ప్రకటించిన ప్రభుత్వం - తెలంగాణ వార్తలు
haritha nidhi : ఆకుపచ్చ తెలంగాణ ధ్యేయంగా హరితహారం కార్యక్రమాన్ని ధీర్ఘకాలికంగా కొనసాగించేందుకు వీలుగా హరితనిధికి సంబంధించిన విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
వివిధ శాఖల నుంచి వచ్చే ప్రతిపాదనలను కమిటీ ఏటా ఆగస్టులో పరిశీలించి ఆమోదించాల్సి ఉంటుంది. ప్రతి మూడు నెలలకోమారు సమావేశమై అనుమతులను పరిశీలించాల్సి ఉంటుంది. హరితనిధి కోసం ప్రత్యేకంగా ఓ బ్యాంకు ఖాతాను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది నిధిపై ఆడిటింగ్ విధిగా చేయాల్సి ఉంటుంది. పురోగతిని ప్రతి మూడు నెలలకోమారు నివేదించడంతో పాటు వార్షిక నివేదికను ప్రతి ఏటా ప్రచురించాల్సి ఉంటుంది. ఈ మేరకు విధివిధానాలు ప్రకటిస్తూ అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చూడండి:Minister KTR in sangareddy: 'సఫాయి కార్మికులకు జీతాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌దే'