శనివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం(World Environment Day) సందర్భంగా... కాలుష్య రహిత భూమి కోసం అందరూ కృషి చేయాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Telangana Governor) పిలుపునిచ్చారు. మన భవిష్యత్తు కోసం పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిమీద ఉందన్నారు.
Governor Tamilisai: కాలుష్య రహిత భూమికోసం సమష్టి కృషి చేద్దాం
భవిష్యత్ తరాలకు కాలుష్య రహిత భూమిని అందించేందుకు ప్రజలందరూ సమష్టిగా కృషి చేయాలని గవర్నర్ తమిళిసై పిలుపునిచ్చారు. శనివారం(June-5th) ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జీవ వైవిధ్యం పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రజలందరూ ప్రతిజ్ఞ చేయాలని విజ్ఞప్తి చేశారు.
Governor Tamilisai: కాలుష్య రహిత భూమికోసం సమష్టి కృషి చేద్దాం
కాలుష్యాన్ని తగ్గించి, మొక్కలు నాటడం ద్వారా జీవవైవిధ్యాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు. కొవిడ్ లాంటి మహమ్మారులు మన దరిచేరకుండా పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నారు.
ఇదీ చూడండి:మూడో దశలో 25% మంది పిల్లలకు కరోనా వైరస్?