రాష్ట్రంలోని తహసీల్దారు కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభించనున్న నేపథ్యంలో మండలానికో దస్తావేజు లేఖరిని (డాక్యుమెంట్ రైటర్) నియమించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. పరీక్ష నిర్వహించి అర్హులను ఎంపిక చేయాలన్న ఆలోచనతో అధికారులు ఉన్నారు.
మండలానికో దస్తావేజు లేఖరికి ప్రభుత్వం సన్నాహాలు! - మండలానికో దస్తావేజు లేఖరికి ప్రభుత్వం సన్నాహాలు!
తెలంగాణలో ఎమ్మార్వో కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభిస్తున్నందున మండలానికి ఒక దస్తావేజు లేఖరిని (డాక్యుమెంట్ రైటర్) నియమించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఒక్కో దస్తావేజు రాసినందుకు వసూలు చేసే రుసుం కూడా నిర్దిష్టంగా ఉండేలా మార్గదర్శకాలు రూపొందించనున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 141 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో అనుమతి పొందిన దస్తావేజు లేఖరులు 850 మంది వరకూ ఉన్నారు. లైసెన్సులు లేకుండా లేఖరులుగా పనిచేస్తున్న వారు మరో 4,500 మంది ఉన్నారు. కొత్తగా మండల కేంద్రాల్లో లేఖరులకు అనుమతి ఇవ్వనున్న నేపథ్యంలో ఇప్పటికే అనుభవం ఉన్న లేఖరులను ప్రతిపాదనలోకి తీసుకోనున్నట్లు సమాచారం. ఒక్కో దస్తావేజు రాసినందుకు వసూలు చేసే రుసుం కూడా నిర్దిష్టంగా ఉండేలా మార్గదర్శకాలు రూపొందించనున్నారు.
ఇదీ చదవండిఃముఖ్యమంత్రి కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ