రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగింపు, సడలింపులపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లేకుండా తిరిగితే రూ. 1000 జరిమానా విధించనున్నట్లు తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో, గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అన్ని రకాల నిర్మాణ పనులకు అనుమతులు ఇస్తున్నట్లు జీఓలో పేర్కొంది. జీహెచ్ఎంసీ పరిధిలో సైట్ వద్ద ఉండే కార్మికులతో నిర్మాణ పనులకు అనుమతి ఇచ్చింది.
అక్కడ మాల్స్ మినహా అన్ని అన్ని దుకాణాలకు...
గ్రామీణ ప్రాంతాలు, గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అన్ని రకాల పరిశ్రమలకు సైతం అనుమతిస్తున్నట్లు వెల్లడించింది. మాల్స్ మినహా గ్రామీణ ప్రాంతాల్లో, గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అన్ని దుకాణాలకు అనుమతి లభించింది. జీహెచ్ఎంసీ, రెడ్ జోన్లలో పక్కపక్కన ఉండే దుకాణాలు, వేర్వేరు రోజుల్లో తెరిచేలా ఆదేశాలు జారీ చేసింది.