ఎల్ఆర్ఎస్ సవరణ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం - తెలంగాణ ఎల్ఆర్ఎస్ కొత్త జీవో
13:34 September 17
ఎల్‌ఆర్‌ఎస్ సవరణ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
స్థలాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ రుసుమును రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది. శాసనసభలో ఇచ్చిన హామీకి అనుగుణంగా ఎల్ఆర్ఎస్ సవరణ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. 2015 పథకంతో సమానంగా క్రమబద్ధీకరణ రుసుములను సవరించింది. 131వ జీఓలో ఉన్న కొత్త స్లాబ్లకు బదులు పాత స్లాబ్ల విధానం ప్రకారమే క్రమబద్ధీకరణ రుసుమును వసూలు చేయనున్నారు. ఈ మేరకు జీఓ నం 135ను జారీ చేశారు.
పదిశాతం ఓపెన్ స్పేస్ లేకపోతే ప్లాట్ ధరలో 14 శాతాన్ని ఆగస్టు 26వ తేదీ నాటి ధర ప్రకారం చెల్లించాల్సి ఉండగా దాన్ని కూడా మార్చారు. ప్లాటు రిజిస్ట్రేషన్ సమయంలోని ధర ప్రకారమే ఈ మొత్తాన్ని చెల్లించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. నాలా రుసుము కూడా క్రమబద్ధీకరణ రుసుములోనే ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. నాలా రుసుమును ప్రత్యేకంగా చెల్లించాల్సిన అవసరం లేదని వెల్లడించింది.
క్రమబద్ధీకరణ రుసుం వివరాలు
- చ.గజం మార్కెట్ ధర రూ.3 వేల వరకు 20 శాతం క్రమబద్ధీకరణ రుసుం
- రూ.3,001 నుంచి రూ.5 వేల వరకు 30 శాతం క్రమబద్ధీకరణ రుసుం
- రూ.5,001 నుంచి రూ.10 వేల వరకు 40 శాతం క్రమబద్ధీకరణ రుసుం
- రూ.10,001 నుంచి రూ.20 వేల వరకు 50 శాతం క్రమబద్ధీకరణ రుసుం
- రూ.20,001 నుంచి రూ.30 వేల వరకు 60 శాతం క్రమబద్ధీకరణ రుసుం
- రూ.30,001 నుంచి రూ.50 వేల వరకు 80 శాతం క్రమబద్ధీకరణ రుసుం
- రూ.50 వేలకు పైగా మార్కెట్ ధర ఉంటే వందశాతం క్రమబద్ధీకరణ రుసుం
ఇదీ చదవండి:ఎల్‌ఆర్‌ఎస్ జీవో సవరించి విడుదల చేస్తాం : కేటీఆర్