తెలంగాణ

telangana

ETV Bharat / state

మిల్లర్ల అసోసియేషన్​ ప్రతిపాదనకు ఓకే చెప్పిన ప్రభుత్వం - పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు

రాష్ట్రంలో మిల్లర్ల అసోసియేషన్​ చేసిన విన్నపాలను తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. 2015-16, 2016-17కు సంబంధించి చెల్లించాల్సిన కస్టమ్​ మిల్డ్ రైస్ ఛార్జీల విషయంలో ఆ అసోసియేషన్​ చేసిన ప్రతిపాదలను ప్రభుత్వం ఒప్పుకుంది.

telangana government accept Millers Association proposal
మిల్లర్ల అసోసియేషన్​ ప్రతిపాదనకు ఓకే చెప్పిన ప్రభుత్వం

By

Published : Jun 13, 2020, 6:34 AM IST

తెలంగాణలో 2015-16, 2016-17కు సంబంధించి చెల్లించాల్సిన కస్టమ్ మిల్డ్ రైస్ ఛార్జీల విషయంలో రైస్ మిల్లర్ల అసోసియేషన్ చేసిన విన్నపాలను ప్రభుత్వం అంగీకరించింది. నాలుగు విడతల్లో ఎలాంటి వడ్డీ లేకుండా కేవలం అసలు మాత్రమే రికవరీ చేయాలని పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

పౌర సరఫరాల కమిషనర్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ బకాయిల రికవరీకి చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆర్థికపరమైన సమస్యలతోపాటు వేరే సమస్యలు ఉండటం వల్ల ఛార్జీలను చెల్లించకపోయామన్నారు. ఛార్జీలపై వడ్డీ వసూలు చేయవద్దని ప్రభుత్వాన్ని అసోసియేషన్ ఇంతకుముందు కోరింది.

ఇదీ చూడండి :సరిహద్దులో సైన్యం సన్నద్ధతపై రాజ్​నాథ్ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details