Formation day Celebrations across Telangana :రాష్ట్రవ్యాప్తంగా అవతరణ వేడుకలు, దశాబ్ది ఉత్సవాలసంబురాలు అంబరాన్నంటుతున్నాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగిన వేడుకల్లో.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అసెంబ్లీలోని గాంధీ విగ్రహానికి ఉదయాన్నే సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. మండలిలో ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర ప్రజలు ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపినిచ్చారు.
Telangana Formation day Celebrations : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లోని కలెక్టరేట్లలో మంత్రులు, ప్రభుత్వ విప్‌లు జాతీయ జెండాను ఎగురవేశారు. నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆదిలాబాద్‌లో ప్రభుత్వ విప్ గంపగోవర్దన్ వేడుకల్లో పాల్గొన్నారు. మంచిర్యాల కలెక్టరేట్‌లో జరిగిన వేడుకలకు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ హాజరయ్యారు. కరీంనగర్ పోలీస్ గ్రౌండ్స్‌లో మంత్రి గంగుల, జగిత్యాల కలెక్టర్ కార్యాలయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సిరిసిల్లలో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. పదేళ్లలో జరిగిన అభివృద్ధిని వివరించారు.
"కేసీఆర్ సారధ్యంలో 9 సంవత్సరాల్లోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ రూపుదిద్దుకుంది. ప్రజాసంక్షేమంలోనూ, అభివృద్ధిలోనూ దేశానికే ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రం ఏర్పడక ముందు వ్యవసాయ, దాని అనుబంధ సంస్థలకు ప్రభుత్వాలు అరకొర నిధులు ఇచ్చేవి. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం 20 రెట్ల నిధులను అధికంగా ఖర్చు చేసింది." - కేటీఆర్, మంత్రి
Telangana Formation day 2023 : నిజామాబాద్‌లో మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. జనగామ కలెక్టరేట్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మహబూబాబాద్‌లో మంత్రి సత్యవతి రాఠోడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పదేళ్ల బీఆర్ఎస్ సర్కార్ అభివృద్ధి ప్రస్థానాన్ని వివరించారు. ములుగులో ప్రభుత్వ విప్ ప్రభాకర్ రావు.. భూపాలపల్లిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వేడుకలకు హాజరయ్యారు.
Decade Celebrations Telangana :అమరవీరులను హనుమకొండలో స్మరించుకున్న ప్రభుత్వ విప్ వినయ్ భాస్కర్.. కలెక్టరేట్‌లో జెండాను ఎగురవేశారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆవిర్భావదశాబ్ది ఉత్సవాలను ప్రారంభించారు. నల్గొండ కలెక్టర్ కార్యాలయంలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి.. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత జెండా ఆవిష్కరించారు.