తెలంగాణ

telangana

ETV Bharat / state

టీఎన్​జీవో భవన్​లో ఆవిర్భావ దినోత్సవం - telangana

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను హైదరాబాద్​ నాంపల్లిలోని టీఎన్​జీవో భవన్​లో ఘనంగా జరిగాయి. ఉద్యోగులందరం ఐక్యంగా పోరాడి సాధించుకున్న తెలంగాణను చుస్తే గర్వంగా ఉందని ఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు కారెం రవీందర్​ రెడ్డి అన్నారు.

నివాళులు అర్పిస్తున్న ఉద్యోగులు

By

Published : Jun 2, 2019, 12:03 AM IST

హైదరాబాద్​లోని టీఎన్​జీవో భవన్​లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు కారెం రవీందర్​ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేందర్​, జిల్లా అధ్యక్షుడు మజీబ్​ కలిసి తెలంగాణ సిద్ధాంత కర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్​ చిత్ర పటానికి పూమాల వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఐదేళ్లలో జరిగిన అభివృద్ధిలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించామని రవీందర్​ రెడ్డి తెలిపారు. ఆంధ్రలో పని చేస్తున్న తెలంగాణ ప్రాంతం ఉద్యోగులను తిరిగి స్వరాష్ట్రానికి తీసుకొచ్చేందుకుటీఎన్జీవోసంఘం కృషి చేస్తుందన్నారు.

టీఎన్​జీవో భవన్​లో ఆవిర్భావ దినోత్సవం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details