రైతుల కన్నీరు తుడవాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. ఖరీఫ్‌లో 40 లక్షల ఎకరాల్లో, రబీలో 38 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశామని తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో చెరువులు, వాగుల్లో నీటిని నిల్వ ఉంచేలా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.
'రైతుల కన్నీరు తుడవాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం'
మిషన్ కాకతీయ ద్వారా అద్భుత ఫలితాలు సాధించామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. అన్ని చెరువులకు తూములు ఏర్పాటు చేసి నీటితో నింపామని తెలిపారు. అన్నదాతల కళ్లలో ఆనందమే కేసీఆర్ సర్కార్ ధ్యేయమని పేర్కొన్నారు.
రైతుల కన్నీరు తుడవాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం
" మిషన్ కాకతీయ ద్వారా అద్భుత ఫలితాలు సాధించాం. అన్ని చెరువులకు తూములను ఏర్పాటు చేసి నీటితో నింపాం. చెక్‌డ్యాంల వల్ల ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. వాటి ద్వారా వాగులు, వంకల్లో నీటిని నిల్వ ఉంచుకోవచ్చు"
- మంత్రి హరీశ్ రావు