తెలంగాణ

telangana

By

Published : Aug 17, 2023, 5:18 PM IST

Updated : Aug 17, 2023, 6:04 PM IST

ETV Bharat / state

Telangana Engineering Special Batch Counseling Dates Change : ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో మార్పులు.. మార్గదర్శకాలు జారీ

Telangana Engineering
Telangana Engineering Special Batch Counseling Schedule Changes

17:08 August 17

Telangana Engineering Special Batch Counseling Dates Change : ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో మార్పులు.. మార్గదర్శకాలు జారీ

Telangana Engineering Spl Batch Counseling 2023 : ఇంజినీరింగ్‌ ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌కు సంబంధించిన తేదీలను తెలంగాణ ఉన్నత విద్యామండలి మార్చింది. ఇంజినీరింగ్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్(Telangana Engineering Counseling 2023) వెబ్ ఆప్షన్ల గడువు ఈనెల 22వరకు పొడిగించారు. నాలుగు కొత్త కాలేజీలు అందుబాటులోకి రావడంతో.. ఇవాళ ప్రారంభమైన ప్రత్యేక విడత కౌన్సెలింగ్ షెడ్యూలులో మార్పులు చేశారు. మహబూబాబాద్, పాలేరులో జేఎన్టీయూ కాలేజీలతో పాటు.. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, టీకేఆర్ పాలిటెక్నిక్‌లు ఇంజినీరింగ్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ అయ్యాయి.

కొన్ని కాలేజీల్లో అదనపు సీట్లు, కోర్సులకు కూడా అనుమతి లభించింది. రేపు ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. నేటి నుంచి ఈనెల 22 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చి.. ఈనెల 26న ప్రత్యేక విడత సీట్లను కేటాయిస్తారు. సీటు పొందిన అభ్యర్థులు ఈనెల 27 నుంచి 29 వరకు కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. ఈనెల 26న స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల చేస్తారు.

Telangana Engineering Counselling 2023 : తెలంగాణ ఇంజినీరింగ్‌ తుది విడత సీట్లు కేటాయింపును పూర్తి చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తెలిపింది. ఇంజినీరింగ్‌ కన్వీనర్‌ కోటాలో 70,627 సీట్లను భర్తీ చేసినట్లు తెలిపారు. ఈ సీట్లను భర్తీ చేయగా ఇంకా కన్వీనర్‌ కోటాలో 13,139 సీట్లు మిగిలిపోయినట్లు ఉన్నతవిద్యామండలి వెల్లడించింది. మిగిలి పోయిన సీట్ల భర్తీకి ఈ నెల 17న ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని మొదట తెలిపిన.. ఇప్పుడు ఈనెల 26కు తేదీని మార్చారు.

Engineering Seats Allotment 2023 : అంతకు ముందు తెలంగాణ ఇంజినీరింగ్‌ రెండో విడతలో కన్వీనర్‌ కోటా సీట్లను కేటాయించారు. ఈ కోటాలో 7,417 మందికి సీట్లు దక్కాయి. మరో 25,148 మంది కాలేజీ లేదా కోర్సులు మార్చుకున్నారు. ఈ విడతలో కన్వీనర్‌ కోటాలో 12,013 సీట్లు మిగిలాయి. ఈ కన్వీనర్‌ కోటాలో మొత్తం 82,702 సీట్లు అందుబాటులో ఉండగా.. రెండో విడత కౌన్సెలింగ్‌తో కలిపి 70,689 సీట్లు భర్తీ అయ్యాయి. ఆగస్టు 2న వీరు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేశారు. కొన్ని బ్రాంచ్‌లలో సీట్లు పూర్తిగా నిండలేదు. మొదటి విడతలో 70,665 ఇంజినీరింగ్​ సీట్లను భర్తీ చేశారు. సీట్లు పొందిన అభ్యర్థులు జులై 22న సెల్ఫ్​ రిపోర్టింగ్​ చేశారు. దీంతో 85.48 శాతం సీట్లు భర్తీ అయినట్లు ఉన్నత విద్యామండలి పేర్కొంది.

Engineering Seats First Phase in Telangana 2023 : మొదటి విడతలో మూడు యూనివర్సిటీలు, 28 ప్రైవేటు కళాశాలల్లో సీట్లన్నీ నిండిపోయాయి. కంప్యూటర్​ సైన్స్​కు సంబంధించిన కోర్సుల్లో 94.20 శాతం సీట్ల కేటాయింపు పూర్తి అయింది. ఈఈఈలో 58.38 శాతం, సివిల్​లో 44.76 శాతం, మెకానికల్​లో 38.50 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. దీంతో ఈ ఏడాది కూడా కోర్​ గ్రూప్​లకు ఆదరణ బాగా కరువైంది.

Telangana EAMCET 2023 : ముగిసిన ఇంజినీరింగ్‌ రెండో విడత కౌన్సిలింగ్‌ ప్రక్రియ.. ఆ కోర్సులో ఒక్కరూ జాయిన్‌ కాలేదంట..!

AI Technology: ఆవిష్కరణల హేళ.. 'ఏఐ'తో భళా.. అద్భుతాలు సాధిస్తున్న ఇంజినీరింగ్‌ విద్యార్థులు

Last Updated : Aug 17, 2023, 6:04 PM IST

ABOUT THE AUTHOR

...view details