Telangana Economy 2022-23 : రాష్ట్ర ఆర్థిక రంగానికి సంబంధించి ప్రణాళిక శాఖ ప్రత్యేక పుస్తకాన్ని రూపొందించింది. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Telangana Deputy CM Bhatti Vikramarka) ఆవిష్కరించిన తెలంగాణ ఎకానమీ పుస్తకంలో పలు వివరాలను పొందుపరిచారు. 2022-23 ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి రూ.13 లక్షల 13 వేల 391 కోట్ల జీఎస్డీపీ వృద్ధి రేటు 16.3శాతం కాగా జాతీయ వృద్ధి 16.1శాతంగా ఉంది. జిల్లాల వారిగా చూస్తే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రంగారెడ్డి అగ్రభాగాన ఉంది. రంగారెడ్డి స్థూల ఉత్పత్తి రూ. 2 లక్షల 41 వేల 843 కోట్ల గా అంచనా వేశారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఇది 18 శాతానికి పైగా ఉంది. రూ.లక్ష 86 వేల158 కోట్లతో హైదరాబాద్ రెండో స్థానంలో 76 వేల 415 కోట్లతో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మూడో స్థానంలో ఉన్నాయి.
రాష్ట్రంలో 90 లక్షలకు పైగా రేషన్‌కార్డులు - 1.19 కోట్ల వంట గ్యాస్ వినియోగదారులు
Telangana District Gross Domestic Product: సంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాలు 35వేల నుంచి 75 వేల కోట్ల మధ్య ఉన్నాయి. నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్, సూర్యాపేట, సిద్దిపేట జిల్లాలు 25 వేల నుంచి 35వేల కోట్ల మధ్య ఉన్నాయి. కరీంనగర్, యాదాద్రి భువనగిరి, మెదక్, హనుమకొండ, పెద్దపల్లి, కామారెడ్డి, మంచిర్యాల, జగిత్యాల, నాగర్ కర్నూల్, వికారాబాద్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలు 15 వేల నుంచి 25వేల కోట్ల మధ్యలో ఉన్నాయి. మిగిలిన జిల్లాలైన ఆదిలాబాద్, నిర్మల్, జోగులాంబ గద్వాల, వనపర్తి, జనగాం, జయశంకర్, రాజన్న సిరిసిల్ల, నారాయణపేట, కొమరం భీమ్ ఆసిఫాబాద్, ములుగు జిల్లాల స్థూల ఉత్పత్తి 15 వేల కోట్ల కంటే తక్కువగా ఉంది. కొమరం భీమ్ జిల్లా స్థూల ఉత్పత్తి 9,577 కోట్లుగా అంచనా వేయగా ములుగు జిల్లా 6,162 కోట్లతో చివరన ఉంది.
Per Capita Income Of Telangana : ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయంఅంచనా రూ. 3 లక్షల12 వేల 398 ఇది జాతీయ సగటు రూ. లక్ష 72 వేల 276 కంటే అధికంగా ఉంది. 2014-15 నుంచి 2022-23 వరకు తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం ఐదు, ఆరేళ్లలో రెట్టింపు అయిందని ఇదే సందర్భంలో జాతీయ సగటు ఎనిమిది సంవత్సరాలుగా ఉందని వివరించారు. తలసరి ఆదాయం విషయంలోనూ రంగారెడ్డి జిల్లా రూ.8,15,996 మొదటి స్థానంలో ఉంది. 4,03,214 రూపాయలతో హైదరాబాద్ జిల్లా రెండో స్థానంలో ఉంది. సంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం రూ.3,08,166
తెలంగాణ సివిల్ సప్లై కార్పొరేషన్ మొత్తం అప్పులు రూ.56వేల కోట్లు : ఉత్తమ్