తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 79,231 మంది నమూనాలను పరీక్షించగా.. 449 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,49,406కి చేరింది. తాజాగా మహమ్మారికి ఇద్దరు బలి కాగా.. మొత్తం మృతుల సంఖ్య 3,825కి పెరిగింది.
ts corona cases: 79,231 మందికి పరీక్షలు.. 449 కొత్త కేసులు - corona cases latest update
రాష్ట్రంలో కొవిడ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా 449 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైరస్ బారిన పడి మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
ts corona cases: 79,231 మందికి పరీక్షలు.. 449 కొత్త కేసులు
వైరస్ బారి నుంచి మరో 623 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 8,406 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
ఇదీ చూడండి: Tokyo Olympics: కరోనా భయపెట్టినా.. ఒలింపిక్స్ ఆగలేదు