ఏపీ నుంచి చికిత్స కోసం.. హైదరాబాద్ వెళ్తున్న కొవిడ్ రోగుల అంబులెన్సులను రాష్ట్ర పోలీసులు అనుమతించకపోవడం వివాదాస్పదమైంది. అంబులెన్స్‌లను.. సరిహద్దుల వద్ద తనిఖీ చేస్తున్న పోలీసులు... కోవిడ్ రోగుల వాహనాలను వెనక్కి పంపుతున్నారు. కోదాడ మండలం రామాపురం చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులు కొవిడ్ రోగులు వచ్చే అంబులెన్సులను వెనక్కి పంపారు. ఏపీ కొవిడ్ రోగులకు రాష్ట్రంలోకి అనుమతి లేదని చెప్పారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్ట్ వద్ద కూడా ఇదే పరిస్థితి కనిపించింది. కర్నూలు నుంచి హైదరాబాద్ వస్తున్న అంబులెన్స్‌లను పుల్లూరు టోల్ గేట్ వద్ద.... తెలంగాణ పోలీసులు నిలిపివేశారు. హైదరాబాద్‌లో పడకలు, ఆక్సిజన్ లేవని చెప్పారు. కడప జిల్లా మైదుకూరు నుంచి హైదరాబాద్ ఆసుపత్రికి ఓ బాధితుడ్ని తరలిస్తుండగా..... టోల్ ప్లాజా వద్ద అడ్డుకున్నారు. రోగి పరిస్థితి విషమంగా ఉందని... దాదాపు రెండు గంటలు బంధువులు బతిమాలినా... పోలీసులు పట్టించుకోలేదు. చేసేది లేక అంబులెన్స్‌లో వెనక్కు తీసుకెళ్లారు.
ఆవేదన.. ఆగ్రహం...
అనంతపురం నుంచి.. హైదరాబాద్ వస్తున్న కరోనా రోగి అంబులెన్స్‌ను నిలిపివేయడంపై ఓ రోగి భార్య తీవ్ర ఆవేదనతోపాటు.. ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి విషమంగా ఉన్నా ఎందుకు అనుమతించడం లేదని... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రశ్నించారు.
అనుమతి ఉంటేనే..