Telangana Congress MLA Candidates First List నెలాఖరులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా Telangana Congress MLA Candidates First List2023 : అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేస్తుందని, ఉత్కంఠకు చాలా వరకు తెరదించుతుందని కాంగ్రెగ్ శ్రేణులన్నీ ఆశగా ఎదురుచూసినా.. పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఏమీ తేల్చకుండానే అసంపూర్తిగా ముగిసింది. నిన్న హైదరాబాద్ తాజ్ కృష్ణా హోటల్లో తొలిసారి పూర్తిస్థాయిలో సమావేశమైన ఈ కమిటీ టికెట్ల ఖరారుపై ఏమీ నిర్ణయించలేదు. ఈ నెలాఖరులోగా మరోసారి కూర్చోవాలని నిర్ణయించినా.. సమావేశం తేదీని ఖరారు చేయలేదు. కమిటీ ఛైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర ఇంఛార్జీ మాణిక్రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తత్కుమార్రెడ్డి, కమిటీ సభ్యుడు బాబా సిద్దిఖీ, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరీ, విశ్వనాథ్, మన్సూర్ అలీ ఖాన్ పాల్గొన్నారు.
Congress Screening Committee Meeting : 'అభ్యర్థుల జాబితా ఇప్పుడే తేల్చలేం.. మరోసారి భేటీ అయ్యాక చెబుతాం'
Telangana Congress MLA Candidates List : ఈ సందర్భంగా అభ్యర్థుల ఖరారుపై ఈ నెల 4, 5 తేదీల్లో ప్రదేశ్ ఎన్నికల కమిటీ సభ్యులు, జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ మంత్రులు, సీనియర్ నేతలతో మురళీధరన్ వ్యక్తిగతంగా మాట్లాడారు. వారిచ్చిన ప్రతిపాదనల ప్రాతిపదికగా మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఖరారుపై మురళీధరన్ ఇతర సభ్యులతో చర్చించారు. దాదాపు 35 నియోజకవర్గాలకు ఒక అభ్యర్థి పేరునే ఎక్కువ మంది ప్రతిపాదించినందున వాటికి ఖరారులో ఎలాంటి ఇబ్బందులు లేవని గుర్తించారు.
Congress MLA Candidates List Telangana : గెలుపు గుర్రాలకై కాంగ్రెస్ అలుపెరగని వేట.. గత పొరపాట్లు రిపీట్ కాకుండా పక్కా ప్లాన్
మిగిలిన సీట్లకు రెండు నుంచి నాలుగు వరకు పేర్లు వచ్చినందున వీటిపై మరింత లోతుగా చర్చించాలని నిర్ణయించారు. బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలనే డిమాండుపైనా చర్చించారు. ప్రతి అభ్యర్థి పేరు ఖరారుకు సామాజిక వర్గాల నేపథ్యంతో పాటు క్షేత్రస్థాయిలో అతనికున్న బలమెంతో తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో అంతర్గత సర్వే చేయిస్తున్నట్లు సమాచారం. ఇతర పార్టీల నుంచి వస్తున్న బలమైన వారికి టిక్కెట్ల కేటాయింపునకు అవకాశముందా, వారికి టికెట్లిస్తే గెలిచే అవకాశాలెంత మేరకు ఉంటాయని కూడా చర్చించారు. కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇస్తే పార్టీకి నష్టం జరుగుతుందని జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు కొందరు చెప్పిన విషయంపైనా చర్చ జరిగింది.
Congress MLA Candidates List Telangana : ఎమెల్యే అభ్యర్ధుల ఎంపికలో కాంగ్రెస్ బిజీబిజీ.. ఛాన్స్ ఎవరికి దక్కేనో..?
‘పీఈసీ సభ్యులతో పాటు అన్ని జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ మంత్రులు, సీనియర్ నేతలు ప్రతిపాదించిన అభ్యర్థుల పేర్లపై, వారి సలహాలు, సూచనలపై ఈ రోజు సమావేశంలో చర్చించాం. వాటిని పరిగణనలోకి తీసుకుంటాం. స్క్రీనింగ్ కమిటీ చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. త్వరలో మరోసారి సమావేశమవుతాం.’-ఠాక్రే
ఒక్కో స్థానానికి ఒకటి నుంచి మూడు పేర్లను ఖరారు చేయాలని స్క్రీనింగ్ కమిటీ నిర్ణయించింది. మరోసారి సమావేశమయ్యాక జాబితాను పార్లమెంటు సమావేశాల తర్వాత పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపుతారని, ఈ నెలాఖరుకల్లా తొలి జాబితాను ప్రకటించవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి.
CWC Meetings in Hyderabad : హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు.. రాష్ట్రంలోనూ 5 గ్యారంటీలతో రెడీ