తెలంగాణ

telangana

ETV Bharat / state

T Congress Leaders Delhi Tour : దిల్లీకి కాంగ్రెస్​ నేతలు.. జగ్గారెడ్డికి దక్కని ఆహ్వానం - తెలంగాణ కాంగ్రెస్​ నేతలను దిల్లీ పిలుపు

AICC Call To Telangana Congress Leaders : సోమవారం ఏఐసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్​ పార్టీ అగ్రనాయకులు.. దిల్లీ వెళ్లనున్నారు. ఈ మేరకు అధిష్ఠానం నుంచి వారికి పిలుపు వచ్చింది. మాణిక్​రావు ఠాక్రే, రేవంత్​ రెడ్డి, ఉత్తమ్​ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితర ముఖ్య నేతలు వెళ్లనున్నారు. జూపల్లి, పొంగులేటి రాహుల్​ గాంధీని కలువనున్నారు.

Congress
Congress

By

Published : Jun 25, 2023, 5:57 PM IST

Telangana Congress Leaders Delhi Tour : తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు దిల్లీ రావల్సిందిగా ఏఐసీసీ నుంచి పిలుపు వచ్చింది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్​రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్‌ చౌదరి, మన్సూర్‌ అలీఖాన్‌, పీసీ విష్ణునాథ్‌లతోపాటు ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, మాజీ మంత్రులు నాగం జనార్ధన్‌ రెడ్డి, చిన్నారెడ్డి, షబ్బీర్‌ అలీ వెల్లనున్నారు.

వీరితో పాటు కేంద్ర మాజీ మంత్రులు రేణుకా చౌదరి, బలరాం నాయక్‌, ఏఐసీసీ కార్యదర్శులు శ్రీధర్​ బాబు, సంపత్‌కుమార్‌, ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీ గౌడ్‌, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌, మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతరావు, ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య, సీనియర్‌ ఉపాధ్యక్షులు మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డి తదితరులు రేపటి రాహుల్‌ గాంధీసమావేశంలో పాల్గొనేందుకు ఏఐసీసీ నుంచి ఆహ్వానం అందింది.

Jupalli And Ponguleti Will Join Congress : కొందరు ఈ సాయంత్రం వెళ్లుతుండగా మరికొందరు రేపు ఉదయం వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఏఐసీసీ కార్యాలయానికి చేరుకోవాలని ఏఐసీసీ స్పష్టం చేసింది. రేపు మధ్యాహ్నం జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డిలతో రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లు సమావేశం అవుతున్నారు.

ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాల ముఖ్యనాయకులతో పాటు సీనియర్‌ నాయకులను దిల్లీకి పిలిచారు. ఇందులో ఎమ్మెల్యే, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలకు ఆహ్వానం అందనట్లు తెలుస్తోంది. భట్టి విక్రమార్క పాదయాత్రలో ఉండడంతో ఆయనను పిలువకపోగా మిగిలిన ఇద్దరిని ఎందుకు ఆహ్వానించలేదో తెలియడం లేదు.

Telangana Congress Party : ఎంతో కాలంగా పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్న వారికి జూపల్లి, పొంగులేటి చేరికతో నష్టం వాటిళ్లకుండా అధిష్ఠానం జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇంకా బీఆర్​ఎస్​, బీజేపీ నుంచి మరికొంత మంది నాయకులు కాంగ్రెస్​లోకి చేరడానికి ఆసక్తిగా ఉన్నారని సమాచారం. జులై 2న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించి.. రాహుల్​ గాంధీ సమక్షంలో పొంగులేటిని కాంగ్రెస్​ పార్టీలోకి ఆహ్వానించనుంది. ఇప్పటికే సభావేదికను సిద్ధం చేస్తున్నారు. ఇందుకు తగిన భారీ జన సమీకరణ.. నియోజకవర్గాల వారీగా సన్నాహకాలను చేస్తున్నారు. ఆ తర్వాత మహబూబ్​నగర్​లో సభ నిర్వహించి.. జూపల్లిని కూడా పార్టీలోకి ఆహ్వానించనున్నారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details