KCR On Holi: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు కలిసి మెలిసి సంతోషంగా సాగాలనే సందేశాన్ని రంగుల పండుగ ఇస్తుందన్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా కలిసి సంతోషంగా చేసుకునే హోలీ పండుగ.. అందరి జీవితాల్లో ఆనందం ఇవ్వాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆకాంక్షించారు. హోలీ పండుగ అన్ని కుటుంబాల్లో ఆనందం నింపాలని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
KCR On Holi: రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ హోలీ శుభాకాంక్షలు - హైదరాబాద్‌లో హోలీ వేడుకలు
KCR On Holi: హోలీ సందర్భంగా సీఎం కేసీఆర్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్సీ కవిత ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. ప్రజలు కలిసిమెలిసి సంతోషంగా సాగాలనే సందేశాన్ని హోలీ పండుగ ఇస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.
హోలీ సందర్భంగా హైదరాబాద్‌లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కార్వాన్, టోలీచౌకి, జియాగూడ, అసిఫ్‌నగర్, చార్మినార్, చంద్రాయణగుట్టతోపాటు పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపట్టారు. బందోబస్తును నేరుగా డీసీపీలు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే మూడు కమిషనరేట్ల పరిధిలో మద్యం అమ్మకాలపై అంక్షలు విధించారు. శనివారం ఉదయం 6 గంటల వరకు మద్యం విక్రయించకుండా నోటిఫికేషన్లు జారీ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో వేడుకలపై నిషేధం విధించారు. సంబంధంలేని వ్యక్తులు, వాహనాలు, భవనాలపై రంగులు చల్లొద్దని పోలీసులు సూచించారు.
ఇదీచూడండి: