ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మానవజాతి ప్రగతికి సంస్కృతి ప్రతిబింబంగా నిలుస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విభిన్న మతాలు, కులాలు, భాషలు, జీవన విధానాలు, కట్టు బొట్టు, ఆహార వ్యవహారాలతో కూడి... భిన్నత్వంలో ఏకత్వం ప్రదర్శిస్తున్న మన సంస్కృతి మహోన్నతమైందని సీఎం వెల్లడించారు.
రాష్ట్ర సంస్కృతి ప్రపంచ సాంస్కృతిక జీవన విధానానికి ఆదర్శం: సీఎం
మానవజాతి ప్రగతికి సంస్కృతి ప్రతిబింబంగా నిలుస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ సంస్కృతి ప్రపంచ సాంస్కృతిక జీవన విధానానికి ఆదర్శంగా నిలిచిందని వెల్లడించారు. ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర సంస్కృతి ప్రపంచ సాంస్కృతిక జీవన విధానానికి ఆదర్శం: సీఎం
దేశంలోని భిన్న సంస్కృతులకు కేంద్రంగా, జీవన వైవిధ్యానికి వేదికగా, మినీ ఇండియాగా తెలంగాణ నిలిచిందని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర సంస్కృతి ప్రపంచ సాంస్కృతిక జీవన విధానానికి ఆదర్శమని వ్యాఖ్యానించారు. సంస్కృతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:ఆర్థిక స్వేచ్ఛ సాధించాలంటే..