గ్రామాభివృద్ధికి పన్నులు పెంచుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. చెల్లించే స్థోమత ఉన్నవారికే పన్ను పెంపు వర్తించేలా చూస్తామని పేర్కొన్నారు. విద్యుత్ సంస్థలు బతకాలంటే ఛార్జీలు పెంచక తప్పదన్న సీఎం... పేదలకు భారం కాకుండా విద్యుత్ ఛార్జీలు పెంచుతామని స్పష్టం చేశారు.
పన్నులు, విద్యుత్ ఛార్జీలు పెంచుతాం: కేసీఆర్
విద్యుత్ సంస్థలు బతకాలంటే ఛార్జీలు పెంచక తప్పదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. పేదలకు భారం లేకుండా పెంచుతామని హామీ ఇచ్చారు.
"గ్రామ పంచాయతీల్లో పన్నుల చెల్లింపునకు సంబంధించి... ఇంటి కొలతలు యజమానులే అందిస్తారు. వారి లెక్కల ప్రకారమే పన్నుల విధింపు ఉంటుంది. ప్రజలపై మాకు నమ్మకం ఉంది.. వాళ్లు నిజాలు చెబుతారనే.. ఆ బాధ్యత అప్పగించాం. అసత్యపు లెక్కలు ఇచ్చిన వారికి 25 రెట్లు జరిమానా విధిస్తాం. అభివృద్ధి కోసం ఛార్జీల పెంపును భరించాలని ప్రజలను కోరుతున్నాను. ప్రజాప్రతినిధులకు విధులు, బాధ్యతలను స్పష్టంగా చెబుతూ చట్టం తెచ్చాం. విధులు, బాధ్యతలు నిర్వహించకపోతే ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకుంటాం "
-సీఎం కేసీఆర్
- ఇదీ చూడండి :'వనరుల పెంపకం, దుబారా తగ్గింపుపై సమాలోచనలు'