Vikas raj on munugode bypoll తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ చెదురు మదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. నియోజకవర్గ వ్యాప్తంగా 119 కేంద్రాల్లోని 298 బూత్‌లలో సాయంత్రం 6గంటలకు పోలింగ్ ముగిసినప్పటికీ .. కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. దీంతో సాయంత్రం 6గంటల వరకు క్యూలైన్లో ఉన్న వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. కొన్ని కేంద్రాల్లో రాత్రి 8, 9 వరకు పోలింగ్ జరిగిందని వికాస్‌రాజ్ చెప్పారు.
''నల్గొండలోని స్ట్రాంగ్‌రూమ్‌కు ఈవీఎంలు తరలిస్తారు. ఈ నెల 6న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఓట్ల లెక్కింపు సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చాం. ఉపఎన్నిక సజావుగా జరిగేందుకు అన్ని చర్యలూ తీసుకున్నాం. స్థానికేతరులను ఎప్పటికప్పుడు బయటకు పంపించాం. ఇంకా పలు పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్లు ఉన్నాయి. సాయంత్రం 6లోగా వచ్చిన వారికి స్లిప్పులు ఇచ్చాం.''- వికాస్‌రాజ్, సీఈఓ