Telangana Cabinet Meeting Concluded Today : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. శుక్రవారం(రేపు) జరగబోయే గవర్నర్ ప్రసంగానికి మంత్రివర్గం ఆమోదం తెలింది. రేపు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Telangana Governor Tamilisai) ప్రసంగం చేయనున్నారు. అయితే గవర్నర్ భేటీలో ఉండాల్సిన అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకున్నారని సమాచారం. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి ప్రసంగం కావడంతో ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనే దానిపైనే ఈ చర్చ జరిగింది. ఈ చర్చ సుమారు గంటన్నర పాటు జరిగినట్లు తెలుస్తోంది.
అయితే గవర్నర్ ప్రసంగంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది, అసలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా రానున్న రోజుల్లో తెలంగాణ ఉండబోతోందనే అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించిన ఆరు గ్యారెంటీలు(Congress Six Guarantees), కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఉన్నాయి. అయితే వీటిలో ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేశారు. ఇవి కాగా మిగిలిన నాలుగు గ్యారంటీలను ఎలా అమలు చేయాలో మంత్రివర్గంలో చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశం అనంతరం రేపు గవర్నర్ ప్రసంగాన్ని మంత్రివర్గం తీర్మానం చేసింది. ఇంకా మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
బాధ్యతలు స్వీకరించిన ఆరుగురు మంత్రులు - పలు శాఖలకు నిధుల విడుదల