తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎన్జీవోలతో భాజపా సమావేశం - ఎన్జీవోలతో భాజపా సమావేశం

దేశంలో ఎన్జీవోల పాత్ర కీలకమైందని భాజపా అభిప్రాయపడింది. ఏ విషయంలోనైనా  సామాన్యులకు సహాయం అందించడంలో ముందుంటాయని నాయకులు తెలిపారు. హైదరాబాద్​లో మహిళా మోర్చా ఆధ్వర్యంలో వివిధ స్వచ్ఛంద సంస్థలతో సమావేశం నిర్వహించారు.

భాజపా అధ్యక్షుడు

By

Published : Feb 26, 2019, 6:56 PM IST

ఎన్జీవోలతో సమావేశం
దేశంలో మహాత్మాగాంధీ కన్న కలలు నిజం కావాలంటే ఎన్జీవోలు ఎలాంటి లాభాపేక్ష లేకుండా పనిచేయాలని భాజపా నాయకులు సూచించారు. హైదరాబాద్​లో మహిళా మోర్చా ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాజపా రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్​, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, భాజపా మహిళ మోర్చా జాతీయ అధ్యక్షురాలు విజయ రహత్కర్​ పాల్గొన్నారు.


ఉగ్రమూకలకు మోదీ సమాధానం


సమాజ అభివృద్ధిలో ఎన్జీవోల పాత్ర కీలకమని భాజపా మహిళా మోర్చా అధ్యక్షురాలు విజయ రహత్కర్​ అన్నారు. స్త్రీల హక్కులు, బాలలపై అత్యాచారాలు వంటి అంశాలపై ఎన్జీవోలు పోరాడుతున్నాయన్నారు. ఉగ్రస్థావరాలపై వైమానిక దాడులతో దేశ ప్రజలంతా మోదీని అభినందిస్తున్నారని పేర్కొన్నారు.


మోదీ మహిళా పక్షపాతి


ప్రధాని మోదీ మహిళా పక్షపాతి అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ప్రజలను చైతన్య పరచడానికి ఎన్జీవోలు చేస్తున్న కృషి అభినందనీయమని ప్రశంసించారు. భారత వైమానిక దళం ఉగ్రస్థావరాలపై జరిపిన దాడిని హర్షిస్తున్నామన్నారు.

ప్రభుత్వం ఫలాలు అందాలి


కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు సామాన్యులకూ అందేలా ఎన్జీవోలు కృషి చేయాలని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. అవినీతిని తగ్గించేందుకు తమ వంతు సహకారం అందించాలని సూచించారు.

ఇవీ చదవండి :"16 స్థానాలు మావే"

ABOUT THE AUTHOR

...view details