తెలంగాణ

telangana

ETV Bharat / state

BJP Comments On Rahul Gandhi: 'అసలు తెలంగాణకు ఎందుకొచ్చాడో రాహుల్​కు తెలుసా?'

BJP Comments On Rahul Gandhi: ప్రగతిభవన్‌ నుంచి పంపించిన స్క్రిప్ట్‌ను రాహుల్‌ గాంధీ వరంగల్‌ సభలో చదివారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. అసలు పర్యటనకు ఎందుకు వచ్చాడో తెలియని వ్యక్తి... ప్రధానమంత్రికి అర్హుడంటూ కాంగ్రెస్‌ నాయకులు చెప్పడం విడ్డూరమని... భాజపా నేతలు ఎద్దేవా చేశారు. 70 ఏళ్ల పాలనలో గుర్తుకురాని రైతులపై ఇప్పుడెందుకు ప్రేమ వొలకబోస్తున్నారని ప్రశ్నించారు.

BJP
BJP

By

Published : May 8, 2022, 5:48 AM IST

'అసలు తెలంగాణకు ఎందుకొచ్చాడో రాహుల్​కు తెలుసా?'

BJP Comments On Rahul Gandhi: రాష్ట్రంలో రాహుల్‌ గాంధీ పర్యటనపై భాజపా నేతలు విమర్శనాస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ దేనికోసం తెలంగాణ పర్యటనకు వచ్చారో ఆయనకే క్లారిటీ లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా..24వ రోజు పాదయాత్ర చేశారు. కాంగ్రెస్-తెరాస పొత్తు ఎన్నడో ఖాయమైందని కేసీఆర్ వద్ద డబ్బు సంచులు తీసుకున్న ఎన్నికల వ్యూహకర్త... కాంగ్రెస్‌తో చర్చలు జరిపారని వ్యాఖ్యానించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో పొత్తు లేదంటూ నాటకాలు ఆడుతున్నారని బండి సంజయ్‌ విమర్శించారు.

కొత్త సీసాలో పాత సారా: కాంగ్రెస్ పార్టీ చేసిన వరంగల్ డిక్లరేషన్‌ను ప్రజలు విశ్వసించబోరని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు అన్నారు. సభలో చేసిన తీర్మానాలు కొత్త సీసాలో పాత సారా లాగా ఉందని ఎద్దేవా చేశారు. 2019లొనే రూ. 2లక్షల రుణమాఫీ హమీని ప్రజలు విశ్వసించకుండా పక్కకు పెట్టారని... ఇప్పుడెలా నమ్ముతారంటూ ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ భాజపానేనన్న రఘునందన్‌... తెరాస, కాంగ్రెస్ పొత్తు ఎన్నికల ముందా లేదా తర్వాతా అనే విషయం తేల్చుకోలేకపోతున్నారని విమర్శించారు.

పసుపు బోర్డుపై ప్రకటనకు దమ్ముందా: వరంగల్ రైతు డిక్లరేషన్... రియల్ ఎస్టేట్ బ్రోచర్‌లా ఉందని ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇవన్నీ ఎందుకు అమలు చేయడం లేదన్నారు. రాహుల్‌ గాంధీ కనీసం అవగాహన లేకుండా మాట్లాడారన్నారు. కాంగ్రెస్ విధానాలతోనే పసుపు ధర పడి పోయిందని ఆరోపించారు. పసుపు బోర్డుపై రాహుల్‌కి పార్లమెంటులో ప్రకటన చేసే దమ్ముందా అని సవాల్ చేశారు. ఇక నుంచైనా పర్యటనకు ఎందుకు వెళ్తున్నారో రాహుల్‌ తెలుసుకోవాలని భాజపా నేతలు ఎద్దేవా చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details