మెహదీపట్నంలోని పుల్లారెడ్డి ఫార్మసీ కళాశాలలో భాజపా కార్యాలయ బేరర్లతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay Kumar) సమావేశమయ్యరు. ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహణపై చర్చిస్తున్నారు. ఈ భేటీలో డీకే అరుణ, స్వామిగౌడ్, రఘునందన్ రావు, రాజాసింగ్, భాజపా ముఖ్య నేతలు పాల్గొన్నారు. భేటీ అనంతరం ప్రజా సంగ్రామ యాత్ర రెండో రోజు మెహదీపట్నం నుంచి ప్రారంభం కానుంది. మెహదీపట్నం, టోలిచౌక్, షేక్ పేట్, గోల్కొండ పోర్ట్, లంగర్ హౌస్ మీదుగా బాపూ ఘాట్ వరకు పాదయాత్ర సాగనుంది. రాత్రి బాపూ ఘాట్ వద్ద బండి సంజయ్ బస చేయనున్నారు.
Bandi Sanjay : భాజపా కార్యాలయ బేరర్లతో బండి సంజయ్ భేటీ... - భాజపా కార్యాలయ బేరర్లతో బండి సంజయ్ భేటీ
భాజపా కార్యాలయ బేరర్లతో బండి సంజయ్ (Bandi Sanjay Kumar) సమావేశమయ్యారు. మెహదీపట్నంలోని పుల్లారెడ్డి ఫార్మసీ కళాశాలలో నిర్వహించిన భేటీలో ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహణపై చర్చిస్తున్నారు. సమావేశం అనంతరం పాద యాత్ర ప్రారంభం కానుంది.
శనివారం పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన బండి సంజయ్ (Bandi Sanjay Kumar) ప్రజా సంగ్రామ యాత్రకు శ్రీకారం చుట్టారు. తెరాస నియంత, అవినీతి, కుటుంబ పాలనను కూకటివేళ్లతో పెకలించేందుకే పాదయాత్ర చేపట్టినట్లు బండి సంజయ్ చెప్పారు. రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులకు ఇదే నాంది కానుందన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, దిల్లీ నుంచి వచ్చిన పార్టీ ముఖ్యనేతలతో పాటు.. రాష్ట్రం నుంచి అన్నిస్థాయుల నాయకులు, పెద్దసంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. హోరెత్తించే నినాదాలు, ఎగసిపడుతున్న శ్రేణుల ఉత్సాహం నడుమ 35 రోజుల మొదటి విడత పాదయాత్రలో సంజయ్ తొలి అడుగు వేశారు. వర్షంలోనూ ముందుకు సాగుతూ తొలిరోజు మెహిదీపట్నం వరకు 10 కిలోమీటర్ల యాత్ర పూర్తిచేశారు.
ఇదీ చదవండి :కుటుంబ పాలనను కూకటివేళ్లతో పెకలిస్తాం: బండి సంజయ్