తెలంగాణ

telangana

ETV Bharat / state

నేటి నుంచి బడ్జెట్ పద్దులపై చర్చ.. మండలి ఛైర్మన్​గా గుత్తా ఖరారు - ts news'

Telangana Assembly: శాసనసభలో నేటి నుంచి బడ్జెట్ పద్దులపై చర్చ ప్రారంభం కానుంది. ఐటీ, పరిశ్రమలు, ఐ అండ్ పీఆర్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ, మహిళా - శిశు సంక్షేమం పద్దులపై ఇవాళ చర్చ జరగనుంది. మండలిలో బడ్జెట్​పై ఇవాళ మండలిలో సాధారణ చర్చ, చర్చకు ఆర్థిక మంత్రి సమాధానం ఉంటాయి. మరోవైపు తెరాస ఎమ్మెల్సీ , శాసనమండలి మాజీ ఛైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డికి శాసనమండలి ఛైర్మన్​ పదవి ఖరారైంది.

నేటి నుంచి బడ్జెట్ పద్దులపై చర్చ.. మండలి ఛైర్మన్​గా గుత్తా ఖరారు
నేటి నుంచి బడ్జెట్ పద్దులపై చర్చ.. మండలి ఛైర్మన్​గా గుత్తా ఖరారు

By

Published : Mar 10, 2022, 2:17 AM IST

Telangana Assembly: శాసనసభలో ఇవాళ్టి నుంచి బడ్జెట్ పద్దులపై చర్చ ప్రారంభం కానుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్​పై అసెంబ్లీలో బుధవారం సాధారణ చర్చ, ప్రభుత్వ సమాధానం పూర్తైంది. దీంతో ఇవాళ్టి నుంచి పద్దులపై చర్చ చేపట్టనున్నారు. ఐటీ, పరిశ్రమలు, ఐ అండ్ పీఆర్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ, మహిళా - శిశు సంక్షేమం పద్దులపై ఇవాళ చర్చ జరగనుంది. ప్రశ్నోత్తరాల్లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు, ఎస్సార్డీపీ పనులు, మూసీ తీరప్రాంత అభివృద్ధి, పాడిపరిశ్రమ, పర్యాటక ప్రాంతాలుగా సరళాసాగర్, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు, సోమశిల మీదుగా కల్వకుర్తి - నంద్యాల జాతీయ రహదారి అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. ఇటీవల మరణించిన దివంగత మాజీ ఎమ్మెల్యేలు ఫరీదుద్దీన్, జంగారెడ్డికి అసెంబ్లీ సంతాపం తెలపనుంది.

అటు మండలిలో బడ్జెట్​పై ఇవాళ మండలిలో సాధారణ చర్చ, చర్చకు ఆర్థిక మంత్రి సమాధానం ఉంటాయి.దివంగత మాజీ ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ కు కౌన్సిల్ సంతాపం ప్రకటించనుంది. మండలి ఛైర్మన్ ఎన్నిక నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయిస్తే ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. నోటిఫికేషన్ ఇస్తే 12వ తేదీన ఎన్నిక చేపట్టవచ్చు. గుత్తా సుఖేందర్ రెడ్డి మళ్లీ ఛైర్మన్​గా బాధ్యతలు స్వీకరించడం ఖాయం. బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో గుత్తా, మంత్రులు, నేతలతో సమావేశమైన సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు గుత్తా పేరును చెప్పినట్లు తెలిసింది. ఛైర్మన్​ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ప్రతిపాదనను గవర్నర్​ అనుమతి కోసం పంపాలని సీఎం అధికారులను ఆదేశించారు. రాజ్​భవన్​ నుంచి అనుమతి వచ్చాక నోటిఫికేషన్​ జారీ అవుతుంది. మరుసటి రోజు నామినేషన్ల దాఖలు గడువు ఇచ్చి ఎన్నిక నిర్వహిస్తారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details