సోమవారం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రతిపక్షనేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. శాసనసభ, మండలి సమావేశాలు ఈ నెల 22 వరకు నిర్వహించాలని నిర్ణయించాయి. శాసనసభ ఈ నెల 14 నుంచి 22 వరకు నిరాటంకంగా సాగనుంది. ఆదివారాలు కూడా సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ నెల 11న మండలి ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. ఆ తర్వాత 14 నుంచి 22 వరకు మండలి సమావేశాలు కొనసాగనున్నాయి. వచ్చే నెలలో కొత్త రెవెన్యూ చట్టంపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు సీఎం తెలియజేశారు.
9రోజుల పాటు సభాపర్వం - KCR
తెలంగాణ శాసనసభ సమావేశాలు 9రోజులు పాటు కొనసాగనున్నాయి. మొహర్రం, గణేశ్ నిమజ్జనాల దృష్ట్యా నేటి నుంచి 13 వరకు సభకు సెలవులు ఇవ్వాలని నిర్ణయించారు.
9రోజుల పాటు సభాపర్వం