తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Nov 29, 2023, 1:54 PM IST

ETV Bharat / state

ఓటరు మహాశయా మేలుకో - ఇకనైనా బద్ధకాన్ని వీడి పోలింగ్ కేంద్రానికి పోటెత్తు

Telangana Assembly Elections Polling 2023 : భారత రాజ్యాంగం కల్పించిన గొప్ప వరం ఓటు హక్కు. ప్రజలకు సుపరిపాలన అందించే ప్రధాన ఆయుధం. కానీ చాలా మంది ఓటర్లు.. పోలింగ్ రోజు ఓటు వేసేందుకు బద్ధకిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ధోరణి కాస్త తక్కువగా ఉన్నా.. పెద్ద పెద్ద పట్టణాలు, నగరాల్లో మాత్రం ఎక్కువ మంది ఓటు వేసేందుకు ముందుకు రావడం లేదు. కనీసం ఈ సారైనా ఆ పరిస్థితిలో మార్పు రావాలని సామాజికవేత్తలు అంటున్నారు.

Telangana Assembly Elections 2023
Telangana Assembly Elections 2023

Telangana Assembly Elections Polling 2023 : రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోసం (Telangana Assembly Elections 2023) అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో ప్రధాన ఘట్టమైన పోలింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే పార్టీలు, ఎమ్మెల్యే అభ్యర్థులు తమకే ఓటు వేసి గెలిపించాలంటూ ఓటర్లను కోరారు. అయితే.. వజ్రాయుధం లాంటి ఓటు హక్కు తమ చేతిలో ఉన్నా.. తమకు కావాల్సిన నేతను తామే ఎన్నుకునే సువర్ణావకాశం ఓటర్లకు ఉంది. అయినా.. చాలా మంది అందుకు ఆసక్తి కనబరచడం లేదు.

ఓటు హక్కు వినియోగంపై యువత ఏమంటోంది?

Voter Awareness in Telangana :బాధ్యతగా ఓటు వేయాల్సిన ఓటర్లు.. తమకేమీ పట్టనట్లుగా ఉంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ధోరణి కాస్త తక్కువగా ఉన్నా.. పెద్ద పెద్ద పట్టణాలు, నగరాల్లో మాత్రం ఎక్కువ మంది ఓటు వేసేందుకు ముందుకు రావడం లేదు. గిరిజన ప్రాంతాల్లో కిలోమీటర్ల కొద్దీ నడిచి వచ్చి.. ఆదివాసీలు ఓటు వేసితమ హక్కును వినియోగించుకుంటున్నారు. ఓవైపు అన్ని సౌకర్యాలు ఉండి .. మరోవైపు పోలింగ్‌ రోజు సెలవు ప్రకటించినప్పటికీ మైదాన ప్రాంతాల్లో ఓటర్లు అందరూ ఓటే వేయడానికి రాకపోవడం.. ఈసీతోపాటు సామాజికవేత్తలనూ ఆలోచనలో పడేస్తోంది.

ఓటేద్దాం - మంచి నాయకుడిని ఎన్నుకుందాం - ప్రజాస్వామ్యాన్ని బలపరుద్దాం

Telangana Assembly Elections Voting 2023 : ఓటు హక్కు వినియోగంలో ప్రధానంగా రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల పరిధిలోని ఓటర్లే వెనుక వరుసలో ఉంటున్నారు. జూబ్లీహిల్స్‌, మలక్‌పేట, యాకుత్‌పుర, నాంపల్లి తదితర నియోజకవర్గాలు 50 శాతం లోపు పోలింగ్‌ నమోదైన జాబితాలో ఉన్నాయి. అదే సమయంలో పాలేరు, భువనగిరి, ఆలేరు, మధిర తదితర నియోజకవర్గాల్లో 90 శాతం పైన ఓటింగ్‌ నమోదైంది.

ఓటు హక్కే కాదు! బాధ్యత కూడా- గతంలో కంటే మెరుగైన పోలింగ్​ శాతం వచ్చేందుకు ప్రయత్నాలు

మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా 2018 ఎన్నికల్లో 2,80,75,912 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 2,05,99,739 (73.37 శాతం) మందే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏకంగా 74,76,173 మంది పోలింగ్‌ కేంద్రాల వైపే రాలేదు. సెలవులు వస్తే పల్లె బాట పట్టే నగర వాసులు.. ఎన్నికల విషయంలోనూ పల్లె ఓటరు బాట పట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మరోవైపు పూర్తి స్థాయి ఓటింగ్‌ కోసం వివిధ దేశాల్లో అవలంభిస్తున్న నిర్బంధ ఓటింగ్‌ విధానాన్ని ఇక్కడా అమలు చేస్తే ఫలితం ఉంటుందని పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను ఆకర్షించేలా ఈసీ చర్యలు :మరోవైపు ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు.. ఎన్నికల సంఘం వివిధ కార్యక్రమాలను (Voter Awareness Telangana) చేపడుతుంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను ఆకర్షించేలా కూడా చర్యలు చేపడుతోంది. కేంద్రాల్లో కనీస వసతులను కల్పించడంతో పాటు ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతోంది. దీంతో పాటు పూర్తిగా మహిళలు, దివ్యాంగులు, యువతే పోలింగ్ కేంద్రాలను నిర్వహించేలా కూడా ఈసీ ప్రణాళికలు సిద్ధం చేసింది.

తొలిసారి ఓటు వేసేందుకు ఉవ్విళ్లూరుతున్న యువతరం

రాష్ట్రంలో మొదటిసారిగా ఇంటి నుంచి ఓటు వేసే విధానం విజయవంతం

ABOUT THE AUTHOR

...view details