తెలంగాణ

telangana

ETV Bharat / state

తీజ్​ను రాష్ట్ర పండుగగా గుర్తిస్తాం: మంత్రి కొప్పుల - తీజ్‌మేళ-2019

తీజ్​ను రాష్ట్ర పండుగగా గుర్తించేందుకు కృషి చేస్తామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​ హామీ ఇచ్చారు. హైదరాబాద్​ రవీంద్రభారతిలో జరిగిన తీజ్​మేళా ఉత్సవానికి మంత్రులు కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్​ గౌడ్​ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.

తీజ్​ను రాష్ట్ర పండుగగా గుర్తిస్తాం:మంత్రి కొప్పుల

By

Published : Aug 20, 2019, 4:43 PM IST

గిరిజనులు ఆర్థికంగా, సామాజికంగా, విద్య, వైద్యరంగంల్లో అభివృద్ధి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌​ అన్నారు. దక్షిణ భారతదేశంలో బంజారా అడపడచులు ఎంతో పవిత్రంగా జరుపుకునే తీజ్‌ను రాష్ట్ర పండుగగా గుర్తించేందుకు కృషి చేస్తామన్నారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ఆల్‌ ఇండియా బంజారా సేవా సంఘ్‌ రాష్ట్ర కమిటి ఆధ్వర్యంలో నిర్వహించిన తీజ్‌మేళా-2019 ఉత్సవంలో మంత్రులు కొప్పుల, శ్రీనివాస్​ గౌడ్​లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ అనంతరం గిరిజన తండాలను పంచాయితీలుగా గుర్తించామని పేర్కొన్నారు. సేవాలాల్‌ జయంతి వేడుకలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు.

తీజ్​ను రాష్ట్ర పండుగగా గుర్తిస్తాం:మంత్రి కొప్పుల
ఇదీచూడండి:పరీక్ష రాసేందుకు వెళ్తే..ఐలవ్యూ చెప్పిన ఇన్విజిలేటర్

ABOUT THE AUTHOR

...view details