ఆంధ్రప్రదేశ్ నెల్లూరు నగరానికి చెందిన ఓ వ్యక్తికి సంబంధించి ఈనెల 3వ తేదీన కరోనా పరీక్ష నిర్వహంచారు. ముందుగా పాజిటివ్ అని రాగా.. అదే రోజు మళ్లీ చేసిన పరీక్షలో నెగెటివ్ అని వచ్చింది. అయితే ఇందుకు సంబంధించిన నివేదికలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటివి చోటు చేసుకోవడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. దీనిపై నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అదనపు ఆర్‌ఎంవో డాక్టర్ కనకాద్రిని వివరణ కోరగా.. ఆ వ్యక్తికి నెగెటివ్ అని తెలిపారు.