సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో నివాసం ఉంటున్న మైఖేల్ దంపతులు ఇటీవల గుండెపోటుతో మరణించారు. తల్లిదండ్రుల అకాల మరణంతో నిస్సహాయ స్థితిలో ఉన్న వారి కుటుంబ సభ్యులను తామున్నామంటూ టీమ్ సాయి బృందం పరామర్సించారు. మైఖేల్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు కాగా వారిని మానవతా దృక్పథంతో ఆదుకోవాలని సదుద్దేశంతో యాభై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.
టీం సాయి బృందం సేవాదృక్పథం.. ఓ కుటుంబానికి ఆర్థికసాయం
టీం సాయి పాండమిక్ సర్వీసెస్ ఓ కుటుంబానికి అండగా నిలిచింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో అనారోగ్య కారణాలతో మరణించిన ఓ కుటుంబానికి ఆర్థికసాయం అందించింది.
టీం సాయి బృందం సేవాదృక్పథం.. ఓ కుటుంబానికి ఆర్థికసాయం
ముగ్గురు పిల్లలలో ఒకరి చదువుకు అవసరమయ్యే ఖర్చును తాము భరిస్తామని భరోసా ఇచ్చారు. స్వచ్ఛంద సంస్థలు సైతం ముందుకు వచ్చి కుటుంబ సభ్యులను ఆదుకోవాలని కోరారు.
ఇవీ చూడండి:వ్యవసాయ శాఖ క్రియాశీలకంగా మారాలి: సీఎం