ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ సేవలు అందించిన 43 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసింది. రేపు రవీంద్రభారతిలో జరగనున్న ఉపాధ్యాయ దినోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అవార్డులను ప్రదానం చేయనున్నారు. ప్రధానోపాధ్యాయులు, గురుకుల విద్యాలయాల ప్రిన్సిపాళ్ల కేటగిరిలో 10 మందిని పురస్కారాలకు ఎంపిక చేసింది. స్కూల్ అసిస్టెంట్ల్లు , సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, పీజీటీ, టీజీటీల కేటగిరీలో 31 మంది ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. లెక్చరర్ల కేటగిరీలో ఇద్దరు డైట్ లెక్చరర్లకు ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది.
43 మందికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు - telangana governament
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ సేవలు అందించిన 43 మంది ఉపాధ్యాయులకు రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.
teachers day