తెలంగాణ

telangana

ETV Bharat / state

కీచక గురువు: ప్రేమ, పెళ్లి పేరుతో విద్యార్థినికి వేధింపులు - bradipeta teachers taja news

ప్రేమ, పెళ్లి పేరుతో ఓ విద్యార్థినిని వేధిస్తున్న కీచక ఉపాధ్యాయుడిని అరండల్ పేట పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అరుండల్ పేట ఎస్సై రవీంద్ర తెలిపారు. గుంటూరు స్తంబాలగరువు శ్రీకృష్ణదేవరాయనగర్​లో జరిగిన ఈ ఘటన పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.

teacher-arrested-in-guntur-dst-due-to-harrasment-of-a-student
ప్రేమ, పెళ్లి పేరుతో విద్యార్థినిని వేధించిన ఉపాధ్యాయుడి అరెస్ట్​

By

Published : Jul 21, 2020, 1:44 PM IST

ఆంధ్రప్రదేశ్​ గుంటూరు స్తంబాలగరువు శ్రీకృష్ణదేవరాయనగర్​కి చెందిన చిల్కా శ్రీనివాసరావు బ్రాడి పేటలో ప్రైవేటుగా ఇంగ్లీష్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ నడిపిస్తున్నాడు. అతనికి పెళ్ళై, పిల్లలు ఉన్నారు. అతనికి ఇంగ్లీష్ తరగతులు కోసం డీఈడీ 2 వ సంవత్సరం చదువుతున్న యువతి కోచింగ్ నిమిత్తం వచ్చింది.

ఈ క్రమంలో ఉపాధ్యాయుడు ఆమె వెంట పడి, ప్రేమ పేరుతొ వేధించసాగాడు. యువతి ఇష్టం లేదని చెప్పడంతో ఆమె తల్లి దండ్రులను కలసి మీ కూతురిని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పాడు. అనంతరం నిశ్చితార్థం చేసుకొని వారి వద్ద నుంచి 2 లక్షలు నగదు తీసుకున్నాడు. వివాహం చేద్దాం అనుకునే సమయానికి శ్రీనివాసరావు గతంలోనే వివాహం జరిగినట్లు తెలిసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుడుని నిలదీశారు. చెప్పవద్దుని శ్రీనివాసరావు బెదిరించాడు.

తల్లిదండ్రులు అతనిపై 2019 లో స్థానిక అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అతనిని కోర్టులో హాజరపర్చి జైలుకి పంపించారు. ప్రస్తుతం బెయిల్ పై బయటకు వచ్చిన శ్రీనివాసరావు మరల ఆమెను పెళ్లి గురుంచి వత్తిడి చేయటం మొదలుపెట్టాడు.

ఆమెకు వచ్చిన సంబంధాలు అన్ని చెడగొడుతున్నాడని బాధితులు తెలిపారు. తల్లిదండ్రులు అతనిపై అరుండల్ పేట పోలీస్ స్టేషన్ లో మరోసారి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు వివరాలను తెలిపారు.

ఇదీ చదవండి:నీటిపారుదల శాఖ జలవనరుల శాఖగా మార్పు: సీఎం కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details