తెలంగాణ

telangana

ETV Bharat / state

Chandrababu Comments on TDP: తెలుగుదేశం పార్టీకి కొత్త రక్తం ఎక్కిస్తా: చంద్రబాబు

TDP President Chandrababu meeting with party leaders : తెలుగుదేశం పార్టీలోకి కొత్త రక్తం ఎక్కిస్తానని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. పనిచేయని నాయకులు ఏ స్థాయి వారైనా మార్చడం ఖాయమని తేల్చి చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టి పార్టీని నిర్లక్ష్యం చేశానని శ్రేణుల వద్ద చంద్రబాబు వాపోయారు.

Chandrababu
Chandrababu

By

Published : Dec 4, 2021, 7:27 AM IST

TDP President chandrababu meeting with party leaders : ఆంధ్రప్రదేశ్​లోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు, దర్శి మున్సిపాలటీలపై సమీక్ష నిర్వహించారు. ఆకివీడు, కుప్పంలో తెదేపా గెలిచే స్థాయిలో ఉన్నా రెండు మున్సిపాలిటీలనూ పోగొట్టుకున్నామని చంద్రబాబు పార్టీ నేతలతో అన్నారు. ప్రత్యర్థి దుర్మార్గాల్ని ఎదుర్కొనే కొత్త నాయకత్వం లేకపోవడం వల్లే ఈ సమస్య ఎదురైందని అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయిలో ఉండి పోరాడి ఓట్లు సాధించేవారికే పార్టీలో పెద్ద పీట వేస్తామని, దానిపై పెద్ద ఎత్తున అధ్యయనం చేస్తున్నామని తెలిపారు.

జగన్​పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత...

TDP President chandrababu meeting with party leaders : ఏపీలో జగన్‌రెడ్డిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న చంద్రబాబు... వచ్చేది తెదేపా ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. పురపాలక ఎన్నికల్లో తెలుగుదేశం ఓట్ల శాతం పెరగటం శుభపరిణామమన్నారు. జగన్‌పై ఉన్న ప్రజావ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వంపైనా చూడలేదన్నారు. ఓటీఎస్‌ పేరుతో పేద ప్రజల నుంచి బలవంతంగా డబ్బులు గుంజుతున్నారని ఆరోపించారు.

సర్పంచ్​ల న్యాయపోరాటానికి అండగా ఉంటా...

ఆంధ్రప్రదేశ్​లో ఎక్కువగా వైకాపా మద్దతుదారులే సర్పంచ్​లుగా ఉన్నప్పటికీ... పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ జగన్ రెడ్డి చేపడుతున్న చర్యలపై తెలుగుదేశం అలుపెరగని పోరాటం చేస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర సర్పంచ్​ల సంఘం ప్రతినిధులు చంద్రబాబును కలిసి తమ సమస్యలను విన్నవించారు. 73వ రాజ్యాంగ సవరణలో పంచాయతీలకు ప్రత్యేక అధికారాలిచ్చారని రాష్ట్ర ప్రభుత్వం వాటిని కాలరాస్తోందని మండిపడ్డారు. సర్పంచ్​ల సంఘం చేసే న్యాయపోరాటానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

TDP President chandrababu meeting with party leaders : జాతీయ స్థాయిలో చేపడుతున్న జనగణనలో బీసీ కుల గణన కూడా చేపట్టే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చంద్రబాబును రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు కోరారు. బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అందడం లేదని బీసి సంక్షేమ సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా తెదేపా హయాంలో 2014 సెప్టెంబర్ 6న జనగణనకు మద్దతుగా అసెంబ్లీలో తీర్మానం చేసినట్లు చంద్రబాబు గుర్తుచేశారు. బీసీ కుల గణన జరిగినపుడే సంక్షేమ ఫలాలు సమర్ధవంతంగా బీసీలకు అందుతాయన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details