తెలంగాణ తెలుగుదేశం దేశం సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదర్‌గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందు రావులను అరెస్టు చేసిన పోలీసులు నారాయణగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రభుత్వ తీరుపై రావుల ఆగ్రహం వ్యక్తం చేశారు.
రావుల అరెస్ట్... నారాయణ గూడ పీఎస్కు తరలింపు
ఇంటర్ బోర్డులో అవకతవకలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని తెతెదేపా నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను బర్తరఫ్ చేయాలని సూచించారు.
అవి చిన్న తప్పులా..?
పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. చిన్న చిన్న తప్పులు సహజమని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడడం దారుణమన్నారు. ఎలాంటి అవగాహనలేని గ్లోబరీనాకు కోట్ల రూపాయల కాంట్రాక్టు ఎలా కట్టబెట్టారని దీనిపై లోతైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాన్ని ఆపలేరని రావుల హెచ్చరించారు. మంత్రి జగదీశ్ రెడ్డి రాజీనామా చేసేవరకు తమ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత