తెలంగాణ

telangana

ETV Bharat / state

'వైద్య పరిస్థితులపై గవర్నర్​కు ఫిర్యాదు చేసిన తెదేపా నేతలు'

రాష్ట్రంలో నెలకొన్న వైద్య పరిస్థితులపై సమీక్షా సమావేశం నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నేతలు గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ను కోరారు.

'వైద్య పరిస్థితులపై గవర్నర్​కు ఫిర్యాదు చేసిన తెదేపా నేతలు'

By

Published : Sep 17, 2019, 2:35 PM IST

రాష్ట్రంలో వైద్య వ్యవస్థ పడకేసిందని తెలుగుదేశం పార్టీ నేతలు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​కు ఫిర్యాదు చేశారు. రాజ్ భవన్​లో తెదేపా రాష్ట్ర అధ్యక్షులు ఎల్​.రమణ, సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఇతర నేతలు గవర్నర్​ను కలిశారు. తాజా వైద్య పరిస్థితులపై సమీక్షా సమావేశం నిర్వహించాలని కోరారు. విష జ్వరాల వల్ల ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయని...వెంటనే సమస్యను పరిష్కరించే విధంగా చూడాలని గవర్నర్​కు విన్నవించారు.

'వైద్య పరిస్థితులపై గవర్నర్​కు ఫిర్యాదు చేసిన తెదేపా నేతలు'

ABOUT THE AUTHOR

...view details