ఎన్టీఆర్ ఘాట్లో నివాళి అర్పించడానికి వచ్చిన లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేయగా తెదేపా శ్రేణులు అడ్డుకున్నారు. ఘాట్ వద్ద రాజకీయాలు మాట్లాడవద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మీపార్వతికి వ్యతిరేకంగా.. చంద్రబాబుకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఘాట్ వద్ద కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాధిని ప్రభుత్వం తరఫున అలంకరణ చేయకపోవడంపై తెదేపా కార్యకర్తలు మండిపడ్డారు. అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఘాట్ వద్దకు నివాళులు అర్పించారు.
లక్ష్మీపార్వతిని అడ్డుకున్న తెదేపా కార్యకర్తలు
దివంగత నేత, తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు 96వ జయంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద లక్ష్మీ పార్వతి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతుండగా తెదేపా నాయకులు, అభిమానులు అడ్డుకున్నారు.
లక్ష్మీపార్వతిని అడ్డుకున్న తెదేపా నేతలు