Chandrababu Fires On State Government: రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఓర్వకల్లు విమానాశ్రయంలో చంద్రబాబుకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికి.. గజమాలతో సత్కరించారు. అనంతరం అక్కడికి వచ్చిన విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.
జగన్ మాట్లాడితే ఏదో జరిగిపోతుందని అనుకుని నమ్మి మోసపోయారని చంద్రబాబు పేర్కొన్నారు. కర్నూలు విమానాశ్రయాన్ని తానే కట్టించినట్లు తెలిపారు. తెలుగుదేశం అంటే అభివృద్ధికి మారుపేరని స్పష్టం చేశారు. హైదరాబాద్కు ధీటుగా అమరావతిని నిర్మించాలని భావించానని చెప్పారు. ప్రజల్లో చైతన్యం రావాలని కోరారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు, చదివించే బాధ్యత తెదేపా తీసుకుంటుందని స్పష్టం చేశారు.