ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం, జయంతిపురంలో సర్వే నెంబర్ 93లో ఉన్న 498.39 ఎకరాల స్థలాన్ని... 2011లో గ్యాస్ బేస్ పవర్ ప్లాంట్, ఎరువుల తయారీ కేంద్రం కోసం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఒప్పందం చేసుకున్నామని తెదేపా నేత భరత్ తెలిపారు. ప్రాజెక్టు మొదలుపెట్టే సమయానికి ఏపీఐఐసీ ధర పెంచిందనీ.. పెరిగిన ధర రూ.70 కోట్లు చెల్లించాలని చెప్పిందన్నారు. తాము ఆ ధర చెల్లించేలోపే రక్షణ స్టీల్ సంస్థ హైకోర్టుకు వెళ్లి ఆ స్థలంపై స్టే తెచ్చుకుందన్నారు. అందుకే తాము ఆ భూమిని తీసుకోలేదనీ.. అది ఇంకా ప్రభుత్వం అధీనంలోనే ఉందని స్పష్టంచేశారు. ఈ విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ తనపై, తన కుటుంబంపై ఆరోపణలు చేయడం దారుణమన్నారు. ఈ ఆరోపణల వెనుక ఉద్దేశం వేరే ఉందనీ.. అమరావతిపై, చంద్రబాబునాయుడిపై బురద చల్లడమే ఆయన లక్ష్యమన్నారు.
ఆ భూమి ప్రభుత్వ అధీనంలోనే ఉంది: బాలకృష్ణ అల్లుడు - భరత్
మాజీ సీఎం చంద్రబాబు వియ్యంకుడికి వేల ఎకరాల స్థలం ధారాదత్తం చేశారన్న మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు అవాస్తవాలని గీతం విద్యాసంస్థ అధ్యక్షుడు, తెదేపా నేత భరత్ తేల్చిచెప్పారు. అమరావతిపై బురద చల్లడానికి తమను పావుగా వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
bharat