ఏపీ అసెంబ్లీలో నలుగురు తెలుగుదేశం సభ్యులను సభాపతి సస్పెండ్ చేశారు. వెలగపూడి, బెందాళం అశోక్, వాసుపల్లి గణేశ్, బాలవీరాంజనేయస్వామి సస్పెండ్ అయ్యారు. కృష్ణా డెల్లా ఆయకట్టు, సాగర్ డెల్టాస్థిరీకరణ, రాయలసీమకు తాగునీటిపై చర్చ సమయంలో సభకు ఆటంకం కలిగిస్తున్నారంటూ స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ చర్యను నిరసిస్తూ చంద్రబాబుతో పాటు మిగిలిన తెదేపా ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు.
ఏపీ శాసనసభ నుంచి చంద్రబాబు వాకౌట్ - assembly
ఏపీ శాసనసభలో నలుగురు తెదేపా నేతలపై సస్పెన్షన్ వేటు పడింది. సభకు ఆటంకం కలిగిస్తున్నారంటూ ఆ పార్టీ నేతలను ఈ రోజు సభ ముగిసేవరకు సభాపతి సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ను నిరసిస్తూ చంద్రబాబుతో పాటు మిగిలిన ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు.
చంద్రబాబు వాకౌట్