తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఏ సమస్య వచ్చినా తెదేపా ఆదుకుంటుంది' - KCR

రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తున్న తెరాస కుట్రలను అడ్డుకుంటాం. ప్రజల పక్షాన తెదేపా పోరాటం ఆగదు. వేల కోట్ల అప్పులను లక్షల కోట్లకు తీసుకొచ్చిన కేసీఆర్ నిజ స్వరూపాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం: ఎల్. రమణ

'ఏ సమస్య వచ్చినా తెదేపా ఆదుకుంటుంది'

By

Published : Mar 29, 2019, 1:00 PM IST

'ఏ సమస్య వచ్చినా తెదేపా ఆదుకుంటుంది'
హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్​లో తెలుగు దేశం పార్టీ 38వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెతెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేశారు.

ప్రజల గొంతుకగా ఉండే ప్రతిపక్షాన్ని లేకుండా చేసేందుకు తెరాస ప్రయత్నాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు రమణ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కేవలం 68 వేల కోట్లు అప్పు ఉంటే దాన్ని 2 లక్షల 25 వేల కోట్లకు పెంచారని ముఖ్యమంత్రి కేసీఆర్​పై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతిపక్షంగా ఉండే ప్రధాన పార్టీలను బతికించాలని ప్రజలను కోరారు.

కార్యక్రమంలో పార్టీ నేతలు పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:'తెదేపాను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది'

ABOUT THE AUTHOR

...view details