సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్ వద్ద ఉన్న డీఎంహెచ్వో కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో తెలంగాణ క్షయ విభాగం రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. గత కొన్నేళ్లుగా టీబీ విభాగంలో పనిచేస్తున్న తమకు పనికి తగిన వేతనం ఇవ్వడం లేదంటూ ఆయన ఆరోపించారు. జీవో 27 ప్రకారం పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఇదే విభాగం వారికి ఎక్కువ జీతాలు ఇస్తున్నారని తెలిపారు.
రాష్ట్రంలో జీవో నెం. 27ను అమలు చేయాలి - tb employees nirasana against wages
సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్ వద్ద తెలంగాణ క్షయవ్యాధి నివారణ విభాగం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సమాన పనికి సమాన వేతనం కల్పించాలంటూ వారు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో జీవో నెం. 27ను అమలు చేయాలి
రేపటినుండి నిక్సయ్ ఆన్లైన్ పనులను బహిష్కరించడంతో పాటు ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులతో హెల్త్ డైరెక్టరేట్ ఆఫీసును ముట్టడించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. తమకు ఉద్యోగ భద్రతతో పాటు రెండు సంవత్సరాలకు గాను ఇంక్రిమెంట్లు కల్పించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: ఆమ్రపాలి రెరా రిజిస్ట్రేషన్ రద్దుకు సుప్రీం ఆదేశం