హైదరాబాద్ గచ్చిబౌలిలోని నిథమ్‌లో పాతకాలపు సంప్రదాయ వంటలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వంటల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో పోటీదారు ఒక ప్రధాన వంటకం మరియు ఒక డెజర్ట్స్, మిల్లెట్, రాగి వంటి సాంప్రదాయక పంట దినుసులనుపయోగించి చేయాలి. నూతన, ఆరోగ్యకరమైన పోషక మరియు సంప్రదాయ ఆహార వంటకాలను పరిచయం చేయడమే ఈ పోటీ ప్రదాన లక్ష్యం.
మా జీవన వైవిధ్యం, మా ఆహారం, మన ఆరోగ్యం పేరిట నిర్వహించిన ఈ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 90 మంది పోటీపడ్డారు. హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థులు, గృహిణులు, నిణుపులు ఇలా మూడు విభాగాలుగా ఈ పోటీలను నిర్వహించారు. ఇందులో హైదరాబాద్, వికారాబాద్‌కు చెందిన పలువురు గృహిణులు ఎంతో ఉత్సహంగా పాల్గొని తమ సంప్రదాయ వంటకాలను తయారు చేసి ఇతరులకు పరిచయం చేశారు. వికారాబాద్ నుంచి వచ్చిన ఇద్దరు గిరిజన మహిళాలు వారి సంప్రదాయ వంటలైనా జొన్న గట్క, రాగి జావ తయారు చేసి ఔరా అనిపించారు.