ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని... రోమ్ చక్రవర్తి నీరో ప్రభువులా వ్యవహరిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా అప్రజ్యాస్వామ్యంగా తయారైందని....అన్నీ శాఖల్లో పనులు కుంటుపడిపోయాయని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో డెంగీ, విషజ్వరాలకు లక్షల మంది గురవుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని... హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసినా ప్రభుత్వంలో ఏమాత్రం కదలిక లేకపోవడం విచాకరమన్నారు.
సీఎం కేసీఆర్ రోమ్ చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు: తమ్మినేని - tammineni veerabhadram
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ముఖ్యమంత్రి కేసీఆర్పై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పాలన కుంటుపడిందని విమర్శించారు. ఇప్పటికైనా సమస్యల పరిష్కారం కోసం సీఎం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
సీఎం కేసీఆర్ రోమ్ చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు: తమ్మినేని