Tamilisai reaction on Murasoli article: తెలుగు మూలాలు ఉండి, ఇంట్లో భాష మాట్లాడుతూ బయట తమిళ వేషం వేసేవారు తనలా నిజమైన తమిళ రక్తం ప్రవహించే వారి వైఖరిని జీర్ణించుకోలేకపోతున్నారని తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై వ్యాఖ్యానించారు. తమిళనాడుపై అభిప్రాయాలు వ్యక్తం చేయొద్దని చెప్పేందుకు వారు ఎవరని ప్రశ్నించారు.
కొందరికి మైక్ మేనియా ఉందని, తెలంగాణలో గొప్పలు చెప్పేందుకు వీలుకాక తమిళనాడును విమర్శిస్తున్నారంటూ.. తమిళిసైని ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ డీఎంకే అధికారిక పత్రిక ‘మురసొలి’లో ఓ వ్యాసం ప్రచురితమైంది. దీనికి స్పందిస్తూ తమిళిసై తాజాగా ప్రకటన విడుదల చేశారు. ‘డీఎంకే తనను అగ్నిపర్వతం అని చెప్పుకొంటోంది. కానీ అది హిమాలయాలను ఏమీ చేయలేదు. ఏం చూసినా భయపడేవాళ్లే గవర్నర్లను విమర్శిస్తున్నారు.